Samantha: ఈ మధ్యకాలంలో ఏది నిజమో? ఏది అబద్దమో కూడా తెలీడం లేదు. ఎందుకంటే, రోజు రోజుకి ఏఐ టెక్నాలజీ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. దీని వలన ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతకి మించిన నష్టాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం, దీని వలన ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా, సెలబ్రిటీలైతే భయపడుతున్నారు. వారి ఫొటోలను వాడి ఇష్టమొచ్చినట్లు క్రియోట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడైతే మరి దారుణంగా సమంత, నాగ చైతన్య ఫేక్ వీడియో క్రియోట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక్కడి వరకు అంటే ఓకే.. వీడియో ఓపెన్ చేస్తే ఘోరమైన సీన్ కనిపించింది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
నాగచైతన్యకి రాఖీ కట్టిన సమంత?
సమంత (Samantha), నాగ చైతన్య విడాకులు తీసుకుని ఎవరికి వారు విడి విడిగా బతుకుతున్నారు. అయినా కూడా వాళ్ళని అలా వదిలేయకుండా కొన్ని వేల మంది రోజూ వీరిద్దరి మీద ఫేక్ ఏఐ వీడియోలు క్రియోట్ చేసి డబ్బు సంపాదిస్తున్నారు. చైతూ శోభితని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు. ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు.. నేను హ్యాపీగా ఉన్నాను, సమంత కూడా తన పనుల్లో తాను బిజీగా ఉంది. ఇద్దరం ఇష్టంతోనే విడిపోయాము. నేను విడిపోయే ముందు కూడా వెయ్యి సార్లు ఆలోచించాను, ఇవేం మీకేం తెలియదు. తెలియకుండా వేరే వాళ్ళని మాటలు అనేస్తారు. అది అలా జరిగిపోయిందని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇప్పుడైతే ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి ఫేక్ వీడియోని (AI generated video) క్రియోట్ చేశారు. ఆ వీడియోలో సమంత ఏడుస్తూ.. నాగ చైతన్యకి రాఖీ కడుతుంది. కొందరు, ఈ వీడియో మండిపడుతూ.. రక్షాబంధన్ అనేది ఒక సంప్రదాయ పండుగ, దాన్ని మీ ఫన్ కోసం వాడుకోకండని సీరియస్ అవుతున్నారు.
ఇలాంటి వీడియోస్ పై నాగ చైతన్య రియాక్షన్ ఇదే..
అంతకుముందు నాగ చైతన్య (Naga Chaitanya) వంటి సెలబ్రిటీలు దీనిపై స్పందించి, ఇటువంటి టెక్నాలజీ దుర్వినియోగాన్ని ఖండించారు. 2023లో రష్మికా మందన్న డీప్‌ఫేక్ వీడియో సంచలనం సృష్టించింది. ఇక ఇదే విషయంలో నాగ చైతన్య ఈ విధంగా స్పందించారు “టెక్నాలజీ దుర్వినియోగం చాలా బాధాకరం, భవిష్యత్తులో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఆలోచించడం కూడా భయంకరంగా ఉంది. దీనిపై చర్యలు తీసుకోవాలి. బాధితులను రక్షించేందుకు ఏదైనా చట్టం అమలు చేయాలి.” అంటూ ఆయన రిక్వస్ట్ చేశారు. చూడాలి, ముందు ముందు దీనికి చెక్ పెడతారా? లేదనేది చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు