Jagga Reddy: కేసీఆర్ ఫ్యామిలీ అలీబాబా 40 దొంగల ముఠా అంటూ కాంగ్రెస్ పార్టీ(Congress Party) సీనియర్ నేత జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని కేసీఆర్(KCR) కుటుంబం దోచుకున్నదన్నారు. భూమి నుంచి ఆకాశం వరకు దేన్నీ వదలకుండా దోచుకున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్( Kcr) కుటుంబంలో అవినీతి ప్రొఫెసర్లు ఉన్నారని విమర్శించారు. అడ్డంగా దోచి, నీతి కబుర్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఫ్యామిలీ దొంగల ముఠా
కార్యకర్తల మీటింగ్‌లో తాను ఎమోషనల్ అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శిస్తున్నారని, కేసీఆర్( KCR) దొంగల ముఠాలో దుబ్బాక ఎమ్మెల్యే కూడా సభ్యుడు అంటూ విమర్శించారు. కార్యకర్తలు, రైతులు, పేద ప్రజల కోసం తన ఆస్తులు అమ్మి న్యాయం చేసే వాడినని, ప్రభాకర్ రెడ్డి లాగా రైతుల భూములు గుంజుకోవడం, అక్రమాలకు పాల్పడడం వంటివి చేయలేదన్నారు. ఫ్యాకేజీలు ఇచ్చి బీ ఫామ్‌లు తెచ్చుకున్న వాళ్లు కూడా విమర్శలకు దిగడం దారుణమన్నారు. కాళేశ్వరంలోని లక్ష కోట్లలో 30 శాతం కేసీఆర్ అండ్ టీమ్ కొల్లకొట్టేసిందన్నారు.
Also Read: Jatadhara Teaser Review: సుధీర్ బాబు వర్సెస్ సోనాక్షి సిన్హా.. ‘జటాధర’ మూవీ టీజర్ ఎలా ఉందంటే..
