Charmy Kaur: సీనియర్ నటి ఛార్మీ కౌర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు ( Tollywood) సినీ ఇండస్ట్రీలో తన అందం, నటనతో హీరోయిన్‌గా సృష్టించింది. ఆ తర్వాత ఐటెం సాంగ్స్ తో అదరగొట్టింది. తన హాట్ అందాలతో అభిమానులను మెప్పించింది. అక్కడితో ఆగకుండా సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టి, “పూరి కనెక్ట్స్” అనే సంస్థను స్థాపించి, పలు సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా తన సత్తా చాటుకుంది.సినిమాలు తీసిన వాటిలో కొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయితే, ఇక ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం గురించి వచ్చిన రూమర్స్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
పూరి జగన్నాథ్‌తో రూమర్స్
ఛార్మీ (Charmy Kaur)దర్శకుడు పూరి జగన్నాథ్( Puri Jagannadh) మధ్య సన్నిహిత సంబంధం గురించి ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. పూరి జగన్నాథ్ తన భార్య లావణ్యతో కాకుండా, ఛార్మీతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని, వారి మధ్య బాండింగ్ సాధారణమైనది కాదని టాక్ నడుస్తోంది. ఈ పుకార్ల కారణంగా పూరి జగన్నాథ్ దాంపత్య జీవితంలో గొడవలు జరిగాయి. ఛార్మీ నే ఆ ఇంట్లో చిచ్చు పెట్టిందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందనే మాటలు బయటకు వచ్చినా, ఇది వృత్తిపరమైన బంధమా? లేక వేరే ఏదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.
కృష్ణవంశీ (Krishna Vamsi divorce) జీవితంలో చిచ్చు?
ఛార్మీ కేవలం పూరి జగన్నాథ్ జీవితంలోనే కాకుండా, మరో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ వైవాహిక జీవితంలో కూడా వివాదాలకు కారణమైందని గతంలో రూమర్స్ వినిపించాయి. కృష్ణవంశీ, రమ్యకృష్ణ దాంపత్యంలో విభేదాలు తలెత్తేలా చేసిందని ఊహాగానాలు వినిపించాయి. దీనికి కారణం ఛార్మీ అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన “శ్రీ ఆంజనేయం”, “చక్రం”, “రాఖి” సినిమాల్లో ఛార్మీ ని హీరోయిన్‌గా తీసుకోవడం ఈ రూమర్స్‌కు ఆజ్యం పోసింది. ఒకే హీరోయిన్‌ను మూడు సినిమాల్లో పదేపదే తీసుకోవడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ రూమర్స్ కారణంగా రమ్యకృష్ణ, కృష్ణవంశీ మధ్య కొంతకాలం మనస్పర్థలు రాగా, తర్వాత వారు తమ సమస్యలను పరిష్కరించుకుని మళ్లీ కలిసిపోయారు.
ఛార్మీ చుట్టూ తిరిగే ఈ రూమర్స్ సినీ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలకు దారితీశాయి. పూరి జగన్నాథ్‌తో ఆమె సహకారం, కృష్ణవంశీ సినిమాల్లో వరుస అవకాశాలు ఆమెను గాసిప్ లలో నెట్టాయి. అయితే, ఈ వివాదాల వెనుక నిజం ఎంతవరకు ఉందో ఎవరికీ తెలియదు. చార్మి ఈ రూమర్స్‌ను ఎప్పుడూ ఖండించకపోవడంతో ఈ గుసగుసలకు మరింత బలం చేకూరింది.
