Pranitha Subhash: ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్లు.. ప్రస్తుతం రీ ఎంట్రీ ఇస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అవుతున్నారు. రమ్యకృష్ణ మొదటి నుంచి బిజీ నటిగానే ఉండగా, రీసెంట్‌గా లయ, జెనీలియా, రాశి, సిమ్రన్, సంగీత, మీరా జాస్మిన్, అన్షు వంటి వారంతా రీ ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు హీరోయిన్లుగా చెలరేగిన వీరంతా.. ఇప్పుడు హీరోహీరోయిన్లకు అక్కగా, అత్తగా, వదిన వంటి పాత్రలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. రీసెంట్‌గా లయ రీ ఎంట్రీ ఇచ్చిన ‘తమ్ముడు’ చిత్రం థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో హీరో నితిన్‌కు అక్కగా లయ కనిపించారు. ఇప్పుడు వీళ్ల బాటలోనే మరో బ్యూటీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. తన గ్లామర్‌తో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో బాపుగారి బొమ్మ అని అనిపించుకున్న ప్రణీత సుభాష్ (Pranitha Subhash) రీ ఎంట్రీకి సిద్ధం అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది.
పూరి జగన్నాథ్ తెలుగులో తీసిన ‘పోకిరి’ (Pokiri) సినిమా కన్నడ రీమేక్ ‘పోర్కి’తో కన్నడలో హీరోయిన్‌గా పరిచయమైన ప్రణీత.. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసింది. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా, మంచి మంచి పాత్రలు ఆమెను వరించాయి. ముఖ్యంగా తెలుగులో ఆమె పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’, ఎన్టీఆర్ ‘రభస’, సిద్ధార్థ్ ‘బావ’ వంటి చిత్రాలలో నటించి, క్రేజ్‌ను, అభిమానులను సొంతం చేసుకుంది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్, ఆకర్షణతో అభిమానుల మనసులను గెలుచుకుంది. సౌత్ ఇండియా వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ప్రణీత.. కెరీర్ పీక్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె మళ్లీ నటనవైపు అడుగులు వేస్తుంది.
Also Read- Jatadhara Teaser Review: సుధీర్ బాబు వర్సెస్ సోనాక్షి సిన్హా.. ‘జటాధర’ మూవీ టీజర్ ఎలా ఉందంటే..
పెళ్లి, పిల్లలతో నటనకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్‌గానే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆమె పోస్ట్ చేసే ఫొటోలు నెటిజన్లను, అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. ఆమె ఇటీవల పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ ఫొటోలలో ఆమెను చూసిన వారంతా, ప్రణీతకు పెళ్లై, పిల్లలు ఉన్నారంటే ఎవరూ నమ్మరు. ఈ అందాల భామ, అంత అందంగా ఆ పిక్స్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఓ మంచి పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు. రెమ్యూనరేషన్ పరంగా పెద్దగా పట్టింపులు లేవు కానీ, మంచి కథ, పాత్ర లభిస్తే మాత్రం.. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది చిత్ర పరిశ్రమలలో కూడా నటించేందుకు రెడీగా ఉన్నట్లుగా ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది. ఈ రీ ఎంట్రీలో ఆమెకు కొన్ని కన్నడ సినిమాల నుంచి పిలుపు కూడా వచ్చిందని తెలుస్తోంది. ఆమె రీ ఎంట్రీ విషయం తెలిసిన టాలీవుడ్ అభిమానులు.. ఎప్పుడెప్పుడు ఆమె టాలీవుడ్ ప్రాజెక్ట్ ఓకే చేస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. చూద్దాం మరి.. మళ్లీ ఆమెను టాలీవుడ్‌కు ఎవరు ఆహ్వానిస్తారో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు