Ott Movie ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

OTT Movie: అమ్మాయి శవంతో కథలు.. ఆ హత్యలు చేసిందెవరు? అద్దిరిపోయే ట్విస్టులతో ఓటీటీలోకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie: ప్రతివారం కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. అలాగే, ఈ రోజు కూడా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమ్ అవుతున్నాయి. అయితే, తెలుగుతో పాటు ఇతర భాషలకు సంబంధించిన చిత్రాలు కూడా రిలీజ్ అవుతుంటాయి. కరోనా తర్వాత నుంచి ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. ఇక నిర్మాతల్లో కొందరు థియేటర్ రిలీజ్ కన్నా ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఎందుకంటే, ఒకసారి ఓటీటీలో రిలీజ్ అయితే, ఖాళీ సమయంలో మీ ఇంట్లో కూర్చొని కూడా చూడొచ్చు. ఇక సినీ లవర్స్ కూడా ఈ ట్రెండ్ నే ఫాలో అవుతున్నారు.

Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. గుబులురేపుతున్న వార్నింగ్స్.. ఇక అంతా జలమయమేనా!

అయితే, ఎప్పటి లాగే ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు ఓటీటీల్లోకి అందుబాటులోకి వచ్చేశాయి.థ్రిల్లర్, సస్పెన్స్, హారర్ మూవీ లవర్స్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ చిత్రం స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఓటీటీ లవర్స్ ను అలరించడానికి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

Also Read: Public Services: ప్రజల సత్వర సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి.. ఇన్చార్జి కలెక్టర్ లెనిన్ వత్సవ్ టోప్పో

ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. ఇద్దరూ ప్రాణ స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఆ ఇద్దరూ మరి ఇద్దరూ అమ్మాయిలను తీసుకుని ఎంజాయ్ చేయడానికి ఓ అడవిలోకి వెళతారు. అయితే, వాళ్ళకి అక్కడ ఓ భవనం కనిపిస్తుంది. అయితే, ఒక రాత్రి వారిలో ఒక అమ్మాయి చనిపోతుంది. ఆమె ఎలా చనిపోయిందో మిగతా వాళ్లకి తెలియదు. కానీ, ఆ అమ్మాయి శవంతోనే చాలా రోజులు భవనంలోనే ఉండిపోతారు. ఆ అమ్మాయి చావుకు తాము కారణం కాదని చెప్పడానికి రక రకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ, అలా చెప్పే సమయంలో ప్రమాదంలో పడతారు. అసలు అక్కడ ఏం జరిగింది? భవనంలో ఎవరైనా ఉన్నారా? ఆ అమ్మాయిని ఎందుకు చంపారు? అనే ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

Also Read: TG School Holidays: అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవు.. తేదీలు ఇవే!

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ పేరే యాధుమ్ అరియాన్. కొద్దీ రోజుల క్రితమే తమిళంలో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో తంబి రామయ్య, అప్పు కుట్టి లాంటి వాళ్లు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు, ఈ మూవీ ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం (ఆగస్టు 8) అర్ధ రాత్రి నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే, తమిళ్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉందని మేకర్స్ చెబుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు