Jatadhara Teaser
ఎంటర్‌టైన్మెంట్

Jatadhara Teaser Review: సుధీర్ బాబు వర్సెస్ సోనాక్షి సిన్హా.. ‘జటాధర’ మూవీ టీజర్ ఎలా ఉందంటే..

Jatadhara Teaser Review: సుధీర్ బాబు (Sudheer babu), సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ప్రధాన పాత్రలలో నటిస్తున్న మైథికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం ‘జటాధర’ (Jatadhara Movie). ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన థండరస్ ఫస్ట్ లుక్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. జీ స్టూడియోస్, ప్రెర్నా అరోరా ఎస్ కే గీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో.. ఉమేష్ కుమార్ బన్స్‌ల, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రెర్నా అరోరా, శిల్పా సింగాల్, నిఖిల్ నందా కలిసి నిర్మిస్తున్నారు. భారతీయ పురాణాల్ని అద్భుతమైన గ్రాఫిక్స్‌తో బ్లెండ్ చేస్తూ, విజువల్ వండర్‌గా తయారవుతోన్న ఈ చిత్ర టీజర్‌ని శుక్రవారం (ఆగస్ట్ 8) మేకర్స్.. రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇంతకు ముందు వచ్చిన పోస్టర్ మానవాళి vs దైవత్వం, శాపం vs శక్తి మధ్య సంగ్రామానికి చిహ్నంగా నిలవగా.. ఇప్పుడొచ్చిన టీజర్.. ఈ సినిమాకు సంబంధించి ఇంకాస్త వివరణను ఇచ్చింది. మరీ ముఖ్యంగా సుధీర్ బాబు వర్సెస్ సోనాక్షి సిన్హా అనేలా సినిమాపై ఈ టీజర్ క్యూరియాసిటీని పెంచేసింది.

Also Read- UP Sisters: ఇదేందయ్యా ఇది.. పెళ్లి చేసుకున్న అక్కాచెల్లెళ్లు.. ఇలాగైతే సింగిల్స్ పరిస్థితేంటి!

టీజర్ విషయానికి వస్తే.. ‘జటాధర’ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించబోతోందనే విషయాన్ని టీజర్‌లోని ప్రతి షాట్ తెలియజేస్తుంది. ముఖ్యంగా ఇదొక పౌరాణిక ఇతిహాసం అనే ఫీల్‌ని ఇస్తోంది. దురాశ వర్సెస్ త్యాగం, చెడు వర్సెస్ మానవత్వం అనే ఇతివృత్తాలతో ఈ సినిమా రూపొందుతుందనే విషయాన్ని టీజర్ తెలియజేస్తుంది. సోనాక్షి సిన్హా పాత్ర ‘దురాశ సృష్టించిన చీకటి’గా పరిచయం చేయబడితే.. సుధీర్ బాబు ‘త్యాగం నుంచి జన్మించినవాడు’గా పరిచయం చేయబడ్డారు. సోనాక్షి సిన్హా కత్తి పట్టుకుని రాజరికపు లుక్‌లో భయానకంగా కనిపిస్తే.. త్రిశూలంతో సుధీర్ బాబు ఒక శక్తివంతమైన పాత్రని చేసినట్లుగా ఈ టీజర్ తెలియజేస్తుంది.

సంస్కృత వచనంతో, అదిరిపోయే విజువల్స్‌తో ప్రారంభమైన టీజర్.. వెంటనే పౌరాణిక వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. పురాతన శిథిలాలు, ఒక ఆలయం వలే ఉన్న గుహ, నిధి పెట్టెలు, లావాతో చుట్టుముట్టబడిన ఒక చెట్టు.. ఈ టీజర్‌పై మరింత ఆసక్తిని పెంచాయి. ఇది దురాశ, దాని విధ్వంసక స్వభావం యొక్క ఇతివృత్తాన్ని హైలైట్ చేస్తుంది. మహామృత్యుంజయ మంత్రం వినిపిస్తూ.. హీరో ఎంట్రీ.. యాక్షన్ షాట్స్, ప్రధాన పాత్రధారులిద్దరూ భీకర యుద్ధంలో పాల్గొనడం వంటి సన్నివేశాలన్నీ గూజ్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. మొత్తంగా అయితే సినిమాపై ఆసక్తిని పెంచేలా ఈ టీజర్‌ని మేకర్స్ కట్ చేశారు. సాంకేతికంగానూ ఈ సినిమా హై లెవల్‌లో ఉంటుందనే విషయాన్ని కూడా ఈ టీజర్ స్పష్టం చేసింది. అక్షయ్ కేజ్రీవాల్, కుసుమ్ అరోరా సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని మేకర్స్ తెలిపారు.

Also Read- Mayasabha Review: దేవా కట్టా ‘మయసభ’ వెబ్ సిరీస్ రివ్యూ

ప్రస్తుతం సుధీర్ బాబు‌కు మంచి హిట్ కావాలి. ఆయన నుంచి హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. గ్యాప్ లేకుండా సినిమాలైతే సుధీర్ బాబు చేస్తున్నాడు కానీ, హిట్ మాత్రం ఆయనకు రావడం లేదు. ఇక ఈ సినిమాతో సోనాక్షి సిన్హా టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఆమె కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంది. ఫస్ట్ టైమ్ సోనాక్షి సిన్హా ఈ తరహా పాత్రలో నటిస్తోంది. అందుకే, ఆమె ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ఆశిస్తోంది. ఇక విడుదల చేసిన రెబల్ స్టార్ ప్రభాస్.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, టీజర్ పవర్ ఫుల్‌గా ఉందని కితాబిచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు