TGSRTC Job Posts: ఆర్టీసీలో ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా పారదర్శకంగా జరుగుతుందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్(VC Sajjanar)స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఉద్యోగార్దులను కొందరు మోసం చేస్తున్నారని యాజమాన్యం దృష్టికి వచ్చిందని అన్నారు. ఎక్స్ వేదికగా తెలిపారు.
Also Read: Samantha: నాగచైతన్యని బెదిరించి పెళ్లి చేసుకుందా? ప్రముఖ సైకాలజిస్ట్ సంచలన కామెంట్స్
దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు
రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సంస్థలో 3038 పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తు ప్రారంభమైందన్నారు. ఈ పోస్టులకు ప్రభుత్వ నియామక బోర్డుల ద్వారా నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుందన్నారు. అడ్డదారుల్లో ఎవరికి కూడా ఉద్యోగాలు రావు అని స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసి డబ్బులు వసూలు చేసే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఉద్యోగార్థులకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకురావాలని, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Read: Cloudburst warning: హైదరాబాద్‌లో మేఘవిస్పోటనం!!.. నగరవాసులకు బిగ్ అలర్ట్