Visakapatnam
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Vizag Fishing Harbour: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఘోర ప్రమాదం

Vizag Fishing Harbour: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో (Vizag Fishing Harbour) గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హార్బర్‌కు సమీపంలోని ఓ స్క్రాప్ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్టుగా సమాచారం. ప్రమాదం తీవ్రత ధాటికి ప్రభావిత వ్యక్తుల శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయి. మృతులను గుర్తించడం కూడా కష్టమేనని స్థానికులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని అంటున్నారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ప్రమాద స్థలానికి వెళ్లారు. వెల్డింగ్ దుకాణంలో వెల్డింగ్‌ కోసం ఉపయోగించే సిలిండర్‌ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. కాగా, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృతుల శరీర భాగాలను వెలికి తీస్తున్నారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also- Rahul Gandhi: ఓట్ల దోపిడీపై ఆధారాలు ఇవిగో.. డేటా ప్రకటించిన రాహుల్ గాంధీ

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!