Allu Arha: మంచు లక్ష్మీ ప్రసన్నను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె (Allu Arjun Daughter) ఓ ఆటాడుకుంది. మాములుగా అందరూ మంచు లక్ష్మి (Manchu Lakshmi) గురించి ఎలా అయితే మాట్లాడుకుంటారో? ముఖ్యంగా ఆమె మాట్లాడే తీరుపై ఎలాంటి కామెంట్స్ చేస్తారో? అదే కామెంట్ డైరెక్ట్‌గా మంచు లక్ష్మిని అడిగి ఆమె షాకిచ్చింది అల్లు అర్హ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తన కుమార్తె అర్హ అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మాట్లాడే ముద్దు ముద్దు మాటలకు అల్లు అర్జున్ చాలా హ్యాపీగా ఫీలవుతుంటారు. ఆ సంతోషానికి కారణమైన అర్హ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి.. ఫ్యాన్స్‌కు కూడా ట్రీట్ ఇస్తుంటారు. అల్లు అర్జున్, అల్లు స్నేహ షేర్ చేసే అర్హ ఫొటోలు, వీడియోలు ఒక్కోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయనే విషయం తెలియంది కాదు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో మంచు లక్ష్మిని ఓ ఆటాడుకుంది అర్హ (Allu Arha). ఆ వీడియో వివరాల్లోకి వెళితే..
Also Read- CPI Narayana: ఆ విషయం చిరంజీవి విజ్ఞతకే వదిలేస్తున్నా.. అంతు చూస్తా అంటూ వార్నింగ్!
‘నువ్వు నన్ను ఏదో అడగాలని అనుకుంటున్నావట కదా.. ఏంటి?’ అని అల్లు అర్హని మంచు లక్ష్మి ప్రశ్నించింది. దీనికి అల్లు అర్హ సమాధానమిస్తూ.. ‘నువ్వు తెలుగేనా?’ అని అడుగుతూ పకాపకా నవ్వేసింది. అల్లు అర్హ ప్రశ్న విన్నమంచు లక్ష్మీ ప్రసన్న ఒక్కసారిగా షాకయింది. ఏంటి ‘నువ్వు తెలుగు’ అని అర్థం కానట్లుగా మరోసారి మంచు లక్ష్మి ప్రశ్నించింది. ‘నువ్వు తెలుగేనా?’ అని మరోసారి అర్హ అడిగేసింది. ‘నేను తెలుగునే పాప.. నీకు ఎందుకు అంత డౌట్ వచ్చింది.. నేను నీతో తెలుగులోనేగా మాట్లాడుతున్నాగా? అని ప్రశ్నించింది. పక్కనే ఇదంతా షూట్ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ‘కాదు.. ఎందుకలా అడిగావ్?’ అని తన కుమార్తె అర్హను ప్రశ్నించారు. వెంటనే మంచు లక్ష్మి కూడా ‘అవును.. ఎందుకలా అడిగావ్?’ అని అర్హను ప్రశ్నించింది. అందుకు అర్హ.. ‘నీ యాక్సెంట్ అలా ఉంది’ అని సమాధానమిచ్చింది. ‘నా యాక్సెంట్ అలా ఉందా’ అంటూ అర్హను ముద్దాడుతూ నవ్వేసింది మంచు లక్ష్మి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Also Read- Coolie: ఓవర్సీస్‌లో రికార్డులు తిరగరాస్తున్న రజనీకాంత్ ‘కూలీ’
ఒక్క అర్హ అనే కాదు.. మంచు లక్ష్మి మాట్లాడే విధానంపై ఎప్పుడు కామెంట్స్ పడుతూనే ఉంటాయి. కొందరు అయితే కామెడీగానూ ఆమె మాట్లాడే తీరును ఇమిటేట్ చేస్తుంటారు. ఆమె యాక్సెంట్‌పై ఇప్పటికీ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే తన యాక్సెంట్‌పై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. ఆమె మాత్రం పాజిటివ్‌గానే తీసుకుంది తప్పితే.. ఎప్పుడూ బాధపడలేదు. కానీ అర్హ కూడా అలా అడిగే సరికి.. పైకి నవ్వినా.. లోపల మాత్రం కాస్త ఫీలైనట్లుగానే కనిపిస్తుంది. ఇక ఈ వీడియోకు నెటిజన్ల కామెంట్స్ చూడాలిరా చారి.. అబ్బో అల్లకల్లోలమే. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మంచు లక్ష్మిన ఇమిటేట్ చేస్తూ.. ఆమె యాక్సెంట్‌లో కొన్ని మాటలను కామెంట్స్‌లో పెడుతూ.. అల్లరల్లరి చేస్తున్నారు.
Arha about Snow Akka Telugu 😂 pic.twitter.com/DoNi71Hz9M
— King Allu Arjun 🗡️ (@KingAlluArjun) August 7, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు