Public Services: ప్రజలకు అందించే సత్వర సేవలపై (Public Services) అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఇన్చార్జి కలెక్టర్ (In-Charge Collector) లెనిన్ వత్సవ్ టోప్పో (Lenin Vatsav Toppo) ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎంపీడీవో,తహసిల్దార్ కార్యాలయం, ఫర్టిలైజర్ షాప్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లను జిల్లా (ఇన్చార్జ్) కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో గురువారం ఆకస్మిక తనిఖీలు (Telangana government services)
చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రధానంగా హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్, రైతులకు సంబంధించి ఎరువుల నాణ్యత, ప్రజలకు సత్వరమైన సేవలు పై ప్రత్యేక దృష్టి పెట్టి పారదర్శకంగా కార్యకలాపాల నిర్వహణకు శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు వారికి కేటాయించిన విధులను క్రమం తప్పకుండా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సబ్ సెంటర్ల వారీగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అవసరమున్న చోట వైద్య శిబిరాలు నిర్వహించాలని, ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్లకు అందుబాటులో వైద్యులు ఉండాలని, ప్రతి ఒక్కరి ఆరోగ్య నివేదికలు సిద్ధం చేయాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, మాత శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: Strange Incident: డబుల్ షాక్.. కవలలకు యువతి ప్రసవం.. బిడ్డల తండ్రులు కూడా వేర్వేరు!
రానున్న రోజుల్లో నిర్వహించే నులు పురుగు దినోత్సవం, బోదకాలు నివారణ కార్యక్రమం మందుల పంపిణీ షెడ్యూల్ ప్రకారం సంబంధిత సిబ్బందితో విజయవంతం చేయాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది హాజరు, మందుల స్టాక్ వివరాలను తనిఖీ చేశారు. ఎంపీడీవో, తాసిల్దార్ కార్యాలయాల ను తనిఖీ చేసి భూభారతి (Bhubharati Files) ఫైళ్ళ నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్ల ఫైళ్ళు (Indiramma Housing), పౌరులకు అందే సేవలలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని వారికి సూచించిన ప్రకారం సేవలు అందించాలని ఆదేశించారు.
మండల కేంద్రంలోని కిషన్ నాయక్ అగ్రి మాల్ సీడ్స్, స్టాక్, తనిఖీ చేశారు. రైతులకు (Farmers) అందుబాటులో విత్తనాలు ( Seeds), ఎరువులు, మందులు, ఫర్టిలైజర్స్ తదితర స్టాకును అందుబాటులో ఉంచాలని నాణ్యమైన విత్తనాలను అందించాలని, రైతు వివరాలు సేకరించి ఆన్లైన్ ద్వారా మాత్రమే ఫర్టిలైజర్స్ ను అమ్మకాలు జరపాలని, సూచించారు. జిల్లాలో డిమాండ్ కనుగుణంగా రైతులకు కావలసిన యూరియా, డి ఏ పి, తదితర ఫర్టిలైజర్స్(Fertilizer Quality) అందుబాటులో ఉన్నాయని రైతుల వివరాల ద్వారా ఇప్పటికే సిద్ధంగా ఉంచడం జరిగిందని అన్నారు.
Also Read: TG School Holidays: అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవు.. తేదీలు ఇవే!
నిత్యం వ్యవసాయ శాఖ అధికారులు విస్తరణ అధికారులు సంబంధిత టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాలని సూచించారు. కల్తీ ఎరువులు, ఫర్టిలైజర్స్ అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ( Ladies Hostels) తనిఖీ చేసి పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం (Telangana government) అత్యంత ప్రతిష్టాత్మకంగా హెల్త్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ సానిటేషన్ లపై దృష్టి పెట్టినందున, అందుకు అనుగుణంగా వసతి గృహంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని నాణ్యమైన రుచికరమైన వేడి, వేడి ఆహారాన్ని అందించాలన్నారు. భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు వహిస్తూ భోజనాన్ని వడ్డించాలని సూచించారు. పిల్లలకు షెడ్యూలు ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి విద్యార్థినిల యొక్క ఆరోగ్య, మానసిక స్థితిగతులను పరిశీలిస్తూ ఉండాలన్నారు.అవసరం ఉన్నచోట మానసిక వైద్య నిపుణుల చేత కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.