Senior Congress Leader Fired On Modi
Politics

V. Hanumantharao: మోదీపై ఫైర్ అయిన కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్

Senior Congress Leader Fired On Modi: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు పర్యటించారు. అనంతరం బీజేపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఎన్నిసార్లు హెచ్చరించిన బిజేపీ నేతలు మాత్రం తమ ప్రవర్తనను మార్చుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. తన భాషను మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హనుమంతరావు సూచించారు.

దేశంలో అభివృద్ధి అంతా యూపీఏ హయాంలోనే జరిగిందని అన్నారు. ఇచ్చిన హామీ ఎప్పుడు మోడీ నిలబెట్టుకోలేదని ఫైర్ అయ్యారు. దేశానికి ఈ ఎన్నికలు చాలా ముఖ్యమని, దేశంలో ఇండియా కూటమి కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు హనుమంతరావు. దేశంలోని పేద ప్రజల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఆలోచిస్తుందని బీజేపీ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని అన్నారు. ఇప్పటిదాకా దేశంలో పీఎం నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయలేదని అన్నారు. నల్లధనం బయటికి తీసుకువస్తానని చెప్పి దేశ ప్రజలను మోసం చేశారన్నారు.

Also Read:శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ప్రధాని ఏపీ ప్రజలను మోసం చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో మార్పు కనిపిస్తుంది.‌ ఇక్కడ కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఐదేళ్లలో మరింత బలంగా అన్ని వర్గాల ప్రజల్లోకి వెళ్తామని ఆయన అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి నేను మాట్లాడదలచుకోలేదని హనుమంతరావు అన్నారు. త్వరలో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం రాజమండ్రి సెల్ఫీ వద్ద విగ్రహం తయారు అవుతుందని అన్నారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?