Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా క్రిష్ జాగర్లమూడి, ఏఎమ్ జ్యోతికృష్ణల దర్శకత్వంలో వచ్చిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) చిత్రానికి ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో మరో భారీ ఆఫర్‌ను ఇచ్చినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్త కనుక నిజమైతే మాత్రం అటు ఫ్యాన్స్‌కు, ఇటు చిత్ర నిర్మాతలకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ పాత్రను పోషించారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.ఎం. రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. జూలై 24న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అయితే అందుకోలేదు. సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే ఈ సినిమా మిశ్రమ స్పందనను రాబట్టుకుంది.
Also Read- Tollywood Hero: ‘జయం’ సినిమాకు రిజిక్ట్ చేశారు.. కట్ చేస్తే, ఇప్పుడు పాన్ ఇండియా ఆ హీరోకి దాసోహం!
సినిమా కొచ్చిన స్పందనతో నిర్మాతలకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా ట్రేడ్ నిపుణులు లెక్కలు చూపిస్తున్నారు. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి వార్తలు భారీ స్థాయిలో హల్‌చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ రూల్స్ ప్రకారం విడుదలైన స్టార్ హీరో సినిమా 8 వారాల తర్వాతే ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ, ఈ సినిమాకు వచ్చిన మిశ్రమ స్పందనతో కేవలం నాలుగు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీకి వస్తుందని, ఆ లెక్క ప్రకారం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్ట్ 22న ఫ్యాన్స్ ‘వీరమల్లు’ ట్రీట్‌గా ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వస్తుందనేలా టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో కూడా ఈ సినిమా అంత గొప్పగా ప్రదర్శన చేయడం లేదు. ఆ సినిమాతో పాటు విడుదలైన ‘మహావతార్ నరసింహ’ పాజిటివ్ టాక్‌తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుండటంతో పాటు, తర్వాత వారమే ‘కింగ్‌డమ్’ రూపంలో మరో సినిమా థియేటర్లలోకి రావడంతో.. ‘వీరమల్లు’ ఏ కోణంలోనూ నిలబడలేని పరిస్థితి నెలకొంది. దీంతో నిర్మాత భారీగా నష్టపోయినట్లుగా తెలుస్తోంది.
Also Read- Manchu Vishnu: తక్షణం అమల్లోకి.. మంచు విష్ణు సంచలన నిర్ణయం
ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సంస్థ.. చిత్ర నిర్మాతకు బంపరాఫర్ ఇచ్చినట్లుగా టాక్. అదేంటంటే.. ఆగస్ట్ 15 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసుకోవడానికి అనుమతి ఇస్తే.. మరో రూ. 15 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందట. నిజంగా ఇది బంపరాఫర్ అనే చెప్పుకోవాలి. నష్టంలో కొంత మేరకు నిర్మాత కూడా సేఫ్ అవుతారు. అలాగే, ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఓటీటీలో చూసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆలోచిస్తే.. ఏ సినిమాకు లేని ఆఫర్ ఈ సినిమాకు వచ్చినట్లే భావించాలి. ఈ ఆఫర్‌కు నిర్మాత కూడా టెంప్ట్ అయినట్లుగా టాక్ అయితే నడుస్తుంది. అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి న్యూస్ రాలేదు. చూద్దాం.. ఏం జరుగుతుందో..?
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
