Sandhya Theatre Stampede (imagecredit:twitter)
తెలంగాణ

Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ పై మానవ హక్కుల కమిషన్ సీరియస్

Sandhya Theatre Stampede: అల్లు అర్జున్​ హీరోగా నటించిన పుష్ప(Pushpa) సినిమా ప్రీవ్యూ షో(Preview show) సందర్భంగా సంధ్య థియేటర్(Sandhya Theatre)​ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(National Human Rights Commission) సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో సమగ్ర నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో అదనపు నివేదికను ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్(Hyderabad Police) కమిషనర్​‌కు ఆదేశాలు జారీ చేసింది.

పుష్ప సినిమా ప్రీవ్యూ షో

గత యేడాది రిలీజైన పుష్ప సినిమా ప్రీవ్యూ షో హైదరాబాద్​ ఆర్టీసీ క్రాస్ రోడ్స్(RTC Cros Road)​ లోని సంధ్య థియేటర్​ లో జరిగిన విషయం తెలిసిందే. దీనికి హీరో అల్లు అర్జున్​(Allu Arjun) తోపాటు హీరోయిన్​ రష్మిక(Rashmika) మందన్న తదితరులు వచ్చారు. కాగా, సినిమా చూడటానికి అల్లు అర్జున్ వచ్చినట్టు తెలియటంతో అప్పటికే థియేటర్ వద్ద వేల సంఖ్యలో గుమిగూడి ఉన్న అభిమానులు ఆయనను చూడటానికి ఎగబడ్డారు. దాంతో థియేటర్‌లో తొక్కిసలాట జరిగింది. దీంట్లో తీవ్రంగా గాయపడ్డ రేవతి(Revathi) అనే మహిళ మృత్యువాత పడింది. ఆమె కుమారుడు శ్రీతేజ్(Sritej) కూడా గాయపడ్డాడు. చాలా రోజులపాటు కిమ్స్ ఆస్పత్రి(Kims Hospital)లో చికిత్స పొందిన అనంతరం శ్రీతేజ్ డిశ్చార్జ్​ అయ్యాడు.

Also Read: Guest Lecturers: 6 నెలలుగా వేతనాలు పెండింగ్.. ఆర్థికశాఖ కొర్రీలు

అల్లు అర్జున్ అరెస్ట్

అయితే, ఇప్పటికీ ఆ చిన్నారి పూర్తిగా కోలుకోలేదు. జరిగిన తొక్కిసలాటపై కేసులు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు(Chikkadpally Police Station) అల్లు అర్జున్(Allu Arjun) ను అరెస్ట్ కూడా చేశారు. ఈ సంఘటనపై న్యాయవాది రామారావు(Ramarao) ఇమ్మనేనితోపాటు సుజాత ఎస్లావత్, సురేష్ బాబు, కొత్త వెంకటేశ్, రాచల యుగేందర్ గౌడ్​, తిలక్ రెడ్డి, బీ.చంద్రశేఖర్ తదితరులు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో నివేదిక ఇవ్వాలని గతంలోనే మానవ హక్కుల కమిషన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అదనపు సీపీ (శాంతిభద్రతలు) కమిషన్ కు నివేదిక ఇస్తూ రోడ్ షో(Road Show) జరపటానికి అల్లు అర్జున్(Allu Arjun) కు అనుమతులు ఇవ్వలేదని తెలిపారు.

చర్యలు ఎందుకు తీసుకోలేద

ఇక, పోలీసులు లాఠీఛార్జ్ చేయటం వల్లనే తొక్కిసలాట జరిగిందంటూ వచ్చిన ఆరోపణల్లో కూడా నిజం లేదని తెలియచేశారు. కాగా, ఎలాంటి అనుమతులు ఇవ్వనపుడు సంధ్య థియేట(Sandhya Theater)ర్ వద్ద జనం భారీగా గుమిగూడినా చర్యలు ఎందుకు తీసుకోలేదని కమిషన్ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే 1993 మానవ హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 18 ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి షోకాజ్ నోటీస్​ జారీ చేసింది. మృతురాలు రేవతి(Revathi) కుటుంబానికి 5లక్షల రూపాయల ఆర్థికసాయం అందించాలని ఎందుకు ఉత్తర్వులు జారీ చేయకూడదో వివరించాలని అందులో పేర్కొంది. అదే సమయంలో ఆరు వారాలలోపు అదనపు నివేదికను కమిషన్​ కు అందచేయాలంటూ హైదరాబాద్(Hyderabad) పోలీస్​ కమిషనర్​ ను ఆదేశించింది.

Also Read: Operation Muskan: ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 177 చిన్నారులకు విముక్తి!

Just In

01

SCU: సుజీత్ సినిమాటిక్ యూనివర్స్.. దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారుగా..!

Arjun Das: ఓరి నీ అభిమానం చల్లగుండా.. మరీ ఇంత పెద్ద మెసేజ్ ఏంటయ్యా?

Sandeep Raj: ‘ఓజీ’ విడుదల వేళ.. 8 సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్‌‌‌తో సంచలనం!

O Cheliya Teaser: హీరో శ్రీకాంత్ వదిలిన ‘ఓ.. చెలియా’ టీజర్ ఎలా ఉందంటే?

Connplex Cinemas: ‘ఓజీ’ సినిమాతో హైదరాబాద్‌లో మరో లగ్జరీ మల్టీప్లెక్స్‌ ప్రారంభం.. వివరాలివే!