Chiranjeevi
ఎంటర్‌టైన్మెంట్

Chiranjeevi: రాజకీయాల్లో లేకపోయినా నాపై విమర్శలు.. అయినా ఎందుకు స్పందించనంటే?

Chiranjeevi: ‘మీపై అన్ని విమర్శలు వస్తుంటాయి కదా.. ఎందుకు స్పందించరు? అని అంతా నన్ను అడుగుతుంటారు. కానీ నేనెప్పుడూ స్పందించను..’’ అంటూ, ఎందుకు స్పందించరో తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. 79వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఫీనిక్స్ ఫౌండేషన్, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (CCT) సంయుక్తంగా బుధవారం మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌ను ప్రారంభించాయి. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ముఖ్య అతిధిగా హాజరు కాగా, సూపర్ హీరో తేజా సజ్జా (Teja Sajja), హీరోయిన్ సంయుక్త (Samyuktha) అతిథులుగా పాల్గొన్నారు. బుధవారం నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో సుమారుగా 800 మంది రక్తదానం చేశారు. ఇలా సేకరించిన రక్తాన్ని ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేయనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు.

శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఈ అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు అత్యంత ఆప్తుడైన సురేష్ చుక్కపల్లి చేస్తున్న అనేక సామాజిక కార్యక్రమాలతో పాటు.. గత రెండేళ్లుగా ఈ బ్లడ్ డొనేషన్ కూడా మొదలుపెట్టి నా హృదయానికి మరింత దగ్గర అయ్యారు. ఇంత చక్కటి, గొప్ప కార్యక్రమం చేస్తున్న నా మిత్రుడు సురేష్‌కి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేయడమే కాకుండా బ్లడ్ డొనేట్ చేసిన బిడ్డ లాంటి తేజకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడే కాదు తను ఎన్నో సార్లు రక్తదానం చేశాడు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన హీరోయిన్ సంయుక్త, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవిలకు థ్యాంక్స్. ఇక్కడ రక్తదానం చేస్తున్న దాతలందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రక్తదానం చేయడం అనేది ఎనలేని సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తుంది. తద్వారా అవసరంలో ఉన్న ఒక ప్రాణం నిలబడుతుంది. ఎన్నో సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్న గొప్ప ఫీలింగ్ ఇది.

Also Read- Ghaati Trailer: సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్టుంటదో చూద్దురు గానీ!

ఆ ఆలోచన నన్ను బాగా ఇబ్బంది పెట్టింది
రక్తదానం గురించి ఇప్పటి వరకు నేను ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఇప్పుడు కొత్త జనరేషన్ కొత్త యువత వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను అనుకుంటున్నాను. ఒక జర్నలిస్ట్‌ రాసిన ఆర్టికల్‌ చదివిన తర్వాతే నాకు ఈ బ్లడ్‌ బ్యాంక్‌ పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఆ జర్నలిస్ట్‌ని ఇప్పటివరకూ చూడలేదు కానీ, ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటాను. దాదాపు 27 సంవత్సరాల క్రితం రక్తం దొరకక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసిన తర్వాత.. ఎందుకు రక్తం దొరకడం లేదు? అనే ఒక ఆలోచన నన్ను బాగా ఇబ్బంది పెట్టేది. మన అభిమానుల్ని బ్లడ్ డొనేషన్ వైపు మళ్లించగలిగితే.. ఒక అత్యంత శక్తివంతమైన సామాజిక సేవ వైపు నడిపినట్లుగా ఉంటుందని, తద్వారా వారికి కూడా ఒక మంచి సంతృప్తి వస్తుంది కదా అని అనిపించింది. ఒక మంచి పనికి నాంది పలికిన వాడిని అవుతానని భావించి.. ఆరోజు ఇచ్చిన పిలుపు‌, ఈరోజు లక్షల మందిని రక్తదానం వైపు కదిలించింది. ఇది నేను చాలా గర్వకారణంగా చెప్పుకునే విషయం. రక్తదానం అంటే చాలు.. నా పేరు స్ఫురణకు వస్తుండటం చూస్తుంటే.. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం ఇదని భావిస్తున్నాను. ఎన్నో జన్మలుగా చేసిన పుణ్యఫలంగా భావిస్తున్నాను.

Also Read- Khadgam Actress: విడాకులు తీసుకోబోతున్న రవితేజ హీరోయిన్.. పెద్ద హింటే ఇచ్చిందిగా?

విమర్శలపై అందుకే స్పందించను
ఆ మధ్యకాలంలో ఒక పొలిటీషియన్ నాపై అకారణంగా అవాకులు చవాకులు పేలారు. ఆ తర్వాత ఆయన ఓ ప్రాంతానికి వెళ్తే.. అక్కడ ఓ మహిళ ఆయనకు ఎదురుతిరిగి ప్రశ్నించింది. ‘చిరంజీవిని అన్నన్ని మాటలు అనాలని మీకు ఎందుకు అనిపించింది’ అని అక్కడే నిలదీసింది. ఆ వీడియో నా వరకు వచ్చింది. ఆ తర్వాత ఆమె గురించి వివరాలు కనుక్కొన్నాను. ఒకప్పుడు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఆమె బిడ్డ ప్రాణాలు నిలిచాయని.. అందుకే నేనంటే ఆమెకు గౌరవమని తెలిపింది. ఆమె నా అభిమాని కూడా కాదట. ఆమె మాటలు నా మనసుని టచ్ చేశాయి. మీపై అన్ని విమర్శలు వస్తుంటాయి కదా.. ఎందుకు స్పందించరు? అని అంతా నన్ను అడుగుతుంటారు. కానీ నేనెప్పుడూ స్పందించను. ఎందుకంటే, నేను చేసిన మంచి కార్యక్రమాలు, మంచి పనులు, నాపై అభిమానులు చూపే ప్రేమే నాకు రక్షణ కవచాలు. ఆ మహిళ ఆరోజు నిలదీసిన తర్వాత సదరు పొలిటీషియన్ ఎక్కడా నా గురించి తప్పుగా మాట్లాడలేదు. వాళ్లకు కూడా మనసు ఉంటుంది. ఆ క్షణంలో కోపంలో నన్ను తిట్టినా, ఇంటికి వెళ్లాక వాళ్ల భార్య అయినా మరోసారి ఇలా మాట్లాడొద్దని చెబుతుంది. అందుకే ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను.. మనం మాట్లాడాల్సిన అవసరం లేదని. మనల్ని ఎవరైనా ఏమైనా అన్నా, విమర్శించినా మన మంచే సమాధానం చెబుతుంది. అందుకే నేను ఎప్పుడూ దేనికీ రియాక్ట్ కాను. మన పని మంచి చేసుకుంటూ వెళ్లిపోవడమే అని భావిస్తాను. నాలాగా మంచి చేసే నా తమ్ముళ్లకు ఎప్పటికీ సాయంగా ఉంటాను. ఇతర దేశాల్లో ఉన్న అభిమానులు కూడా నా మాటను స్ఫూర్తిగా తీసుకొని రక్తదానం చేస్తున్నారంటే.. ఇంతకంటే ఏం కావాలి? వాళ్లందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేసిన నా మిత్రుడికి మరోసారి అభినందనలు తెలియజేస్తూ.. ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా, ఎప్పుడు చేసినా.. నన్ను పిలవండి. నేను మీకు అందుబాటులో ఉంటాను’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు