War 2: ఆగస్ట్ 14న బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరగబోతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) హీరోగా నటించిన ‘కూలీ’ (Coolie)కి పోటీగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan), టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) కలిసి నటించిన ‘వార్ 2’ (War 2) చిత్రాలు నువ్వా, నేనా? అనేలా పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు సినిమాలకు సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలోకి ఈ సినిమాలను తీసుకెళ్లడంతో చాలా వరకు సక్సెస్ అయ్యాయి. అయితే కొన్ని మైనస్‌లు కూడా ఈ రెండు చిత్రాలకు హైలైట్ అవుతున్నాయి. విడుదల లోపు ఆ మైనస్‌లను అధిగమించి, ఒకదానిని మించి మరొక సినిమాను ప్రేక్షకుల దృష్టిలో పడేలా చేయడానికి మేకర్స్ సాధ్యమైనంతగా ఎఫర్ట్ పెడుతున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ రేసులో ‘కూలీ’ కంటే, ‘వార్ 2’ చిత్రమే ఒకడుగు వెనుకపడి ఉంది. టికెట్ బుకింగ్స్ పరంగా రజనీకాంత్ సినిమా రచ్చరంబోలా అనేలా దూసుకుపోతుంది. ఎలాగైనా ‘కూలీ’ని బీట్ చేయాలని ‘వార్ 2’ మేకర్స్ ఇప్పుడు పెద్ద ప్లాన్‌తోనే దిగుతున్నారు.
Also Read- Raksha Bandhan: రాఖీ పండుగ ఎందుకు జరుపుకోవాలి.. రాఖీ కట్టకపోతే ఏమవుతుందో తెలుసా?
ఈ రెండు చిత్రాలకు యాక్షన్ పరంగా పోటీ లేదు. ఎందుకంటే, రజినీ తరహాలోనే ఎన్టీఆర్ కూడా యాక్షన్ హీరోనే. అందులోనూ ‘వార్ 2’ మూవీ యాక్షన్ ప్యాక్‌డ్ మూవీ. ఇక లోకేష్ కనగరాజ్ మూవీలో యాక్షన్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో.. ఇప్పుడు ‘కూలీ’ని కొట్టాలంటే యాక్షన్ సరిపోదు. అదే కనిపెట్టింది ‘వార్ 2’ టీమ్. ‘కూలీ’ని బీట్ చేసేలా ‘వార్ 2’ నుంచి మ్యూజికల్ స్ట్రాటజీని ప్లే చేయబోతున్నారు. ఆదిత్య చోప్రా గత ముప్పై ఏళ్లుగా ఇండియన్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన, విప్లవాత్మకమైన ఆలోచనలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ.. ఎన్నో భారీ చిత్రాలను అందించారు. తాజాగా ‘వార్ 2’ కోసం ఆయన తన ‘కజ్రా రే, ధూమ్ 3’ రేంజ్‌లో మ్యూజికల్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యారు.
Also Read- Manchu Manoj: మంచు మనోజ్ సోలో హీరోగా.. పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్!
యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ‘వార్ 2’లోని హృతిక్ రోషన్, ఎన్టీఆర్ డ్యాన్స్‌కు సంబంధించిన కంటెంట్‌ని వదిలేందుకు రెడీ అయ్యారు. ‘వార్ 2’ నుంచి హృతిక్, ఎన్టీఆర్ డ్యాన్సింగ్ సాంగ్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను ఈ వారంలో విడుదల చేయబోతున్నారు. ఇలా గ్లింప్స్‌ను విడుదల చేయటానికి గల కారణం.. ఇద్దరు మేటి డ్యాన్సర్స్ చేసే డ్యాన్సింగ్ మ్యాజిక్‌ని పరిచయం చేసి.. ప్రమోషన్స్‌లో దూసుకుపోవాలనేదే ప్లాన్ అనేలా సినిమా ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం అందరి దృష్టి ఎన్టీఆర్, హృతిక్ డ్యాన్స్ నంబర్ పైనే ఉంది. ఈ విషయం చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రాకు తెలుసు. భారీ పోటీ ఉన్న నేపథ్యంలో.. విడుదల వరకు ఈ పాట కోసం హైప్‌ను పెంచేలా మేకర్లు ప్లానింగ్ చేస్తున్నారు. అందుకే ఫుల్ సాంగ్‌ని ముందే వదలకుండా థియేటర్లలో ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా దాచి పెడుతూ.. జస్ట్ గ్లింప్స్‌ని మాత్రమే విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ గ్లింప్స్ తర్వాత ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతాయని, రేస్‌లో ముందుకు వచ్చేస్తామని చిత్రయూనిట్ ధీమాని వ్యక్తం చేస్తోంది. చూద్దాం.. మరి ఏం జరుగుతుందో? అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో YRF స్పై యూనివర్స్ నుంచి వస్తున్న ఈ ‘వార్ 2’లో హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు