TSRTC is now TGSRTC టీఎస్‌ ఆర్టీసీ.. ఇక టీజీఎస్‌ ఆర్టీసీ
tsrtc bus palle velugu
Political News

RTC: టీఎస్‌ ఆర్టీసీ.. ఇక టీజీఎస్‌ ఆర్టీసీ

TGSRTC: మన తెలంగాణ ఆర్టీసీ పేరు మారింది. ఇప్పటి వరకు టీఎస్‌ ఆర్టీసీగా కొనసాగిన ఆర్టీసీ.. ఇకపై టీజీఎస్‌ఆర్టీసీగా కొనసాగనుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ స్థానంలో టీజీగా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్‌ హెడ్‌లపై ఉన్న టీఎస్‌ స్థానంలో టీజీ కనిపించనుంది. ఈ మేరకు కేంద్రం కూడా అనుమతిని మంజూరు చేస్తూ గెజిట్‌‌ను కూడా జారీ చేసింది. త్వరలోనే ఆర్టీసీ లోగోలో మార్పులు చేపట్టటంతో బాటు ఇకపై ఆర్టీసీ బస్సులను టీజీ సిరీస్‌తో రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు సంస్థ ఎండీ సజ్జనార్‌ సైతం సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్‌ఆర్టీసీ పేరును టీజీఎస్‌ఆర్టీసీగా మార్చడం జరిగిందని.. ఈ మేరకు అధికారిక ఎక్స్‌ ఖాతాలు @tgsrtcmdoffice, @tgsrtchq గా మార్చినట్లు పేర్కొన్నారు. విలువైన సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులను మార్చిన ఈ ఖాతాల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఇప్పటివరకూ వాహనాల రిజిస్ట్రేషన్‌కు మాత్రమే పరిమితమైన టీజీ నిబంధనను అధికారులు ఇతర ప్రభుత్వ సంస్థల విషయంలోనూ అమలు చేస్తున్నారు. ఇప్పటికే టీఎస్ఎస్పీడీసీఎల్‌ను టీడీఎస్పీడీసీఎల్‌గా మార్చగా.. ఇదే క్రమంలో మరిన్ని సంస్థల పేర్లు మారనున్నాయి.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..