Telangana CM Revanth reddy Mass Warning To KCR
Politics

CM Revanth Reddy: సీఎం జూమ్ మీటింగ్.. పార్టీ నేతలకు దిశానిర్దేశం

– ఎమ్మెల్సీ ఉపఎన్నికపై సీఎం ఫోకస్
– పార్టీ నేతలతో జూమ్ మీటింగ్
– ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచన

Zoom Meeting: ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచేలా పని చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ ఉపఎన్నిక కోసం సీఎం రేవంత్ రెడ్డి మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జీలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంటు ఇంచార్జీలు క్రియాశీలకంగా పని చేయాలని తెలిపారు.

ఈ నెల 27న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు సన్నద్ధం కావాలని పిలుపు ఇచ్చారు. ప్రతి ఎమ్మెల్యే తమ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ బూత్‌లను సందర్శించాలని సూచించారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి ఒక వారధిగా పని చేస్తారని తెలిపారు. కాబట్టి, విద్యార్థి, నిరుద్యోగల సమస్యల పరిష్కారానికి మల్లన్న గెలుపు ఉపయోగపడుతుందని వివరించారు. ఇది తీన్మార్ మల్లన్న ఎన్నిక మాత్రమే కాదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నిక అని స్పష్టం చేశారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దిశానిర్దేశం చేశారు.

Just In

01

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?