TPCC Mahesh Kumar( image CREDIT: TWITTER)
Politics, లేటెస్ట్ న్యూస్

TPCC Mahesh Kumar: జనహిత పాదయాత్ర కంటిన్యూ.. పీసీసీ చీఫ్​ వెల్లడి!

TPCC Mahesh Kumar: జనహిత పాదయాత్ర విడతల వారీగా ఉంటుందని పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud)వెల్లడించారు. ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ, జనహిత పాదయాత్రలో ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో సంతృప్తి కనిపించిందన్నారు. పథకాలను ప్రస్తావిస్తూ అనేక చోట్ల ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశంసించారని గుర్తు చేశారు. ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు జనహిత పాదయాత్ర చేపట్టామని, ఇక నుంచి విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని ప్రకటించారు.

 Also Read: Ramachandra Rao: కాంగ్రెస్‌కు లోకల్ ఆలోచన లేదు.. రాంచందర్ రావు సంచలన కామెంట్స్!

కవిత పాత్ర ఏంటి?

నెలకు నాలుగు ఐదు రోజులు జనహిత పాదయాత్రను నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. కార్యకర్తలకు అండగా నిలుస్తున్నామన్నారు. ఇక కేసీఆర్ ఒంటెత్తు పోకడల వలన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. బీసీ ఉద్యమంలో కవిత పాత్ర ఏంటి? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ బీసీ ఉద్యమానికి ఎవరు మద్ధతిచ్చినా స్వాగతిస్తామన్నారు. బీసీ బిల్లుకు మద్ధతు ఇచ్చిన బీజేపీ ప్రజాప్రతినిధులు ఎందుకు తొక ముడిచారు? అంటూ ప్రశ్నించారు. మైనార్టీల పేరుతో బీసీ బిల్లును అడ్డుకోవాలని కిషన్ రెడ్డి చూస్తున్నాడని, కానీ బీసీలు లేకుండా కిషన్ రెడ్డి పోటీ చేయగలడా? అంటూ నిలదీశారు.

 Also Read: Kashmir: జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ?.. సైలెంట్‌గా కీలక పరిణామం!

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?