Meenakshi Natarajan (Image Source: Twitter)
తెలంగాణ

Meenakshi Natarajan: ఢిల్లీ వెళ్లిన మీనాక్షి నటరాజన్.. బీసీ నేతలతో రైలు ప్రయాణం

Meenakshi Natarajan: ఏఐసీసీ రాష్​ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీ వెళ్లారు. సోమవారం ఉదయం చర్లపల్లి రైల్వే స్వేషన్ (Cherlapalli Railway station) నుంచి ప్రత్యేక రైలులో ఆమె బీసీ నేతలతో కలిసి వెళ్లారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు టీపీసీసీ ఉద్యమం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీసీ సంఘాలు, బీసీ నేతలంతా హస్తిన బాట పట్టారు. ఇక ఢిల్లీలో మూడు రోజుల ప్రత్యేక ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Also Read: Guvvala Balaraju: గులాబీని ఖాళీ చేసేలా కమలం స్కెచ్.. లోకల్‌‌‌‌కు ముందే దెబ్బకొటేలా ప్లాన్

ఆగస్టు 5న పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు వాయిదా తీర్మానానికి టీపీసీసీ నేతలు పోరాటం చేయనున్నారు. ఆగస్టు 6న జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల అమలుకు మద్దతుగా భారీ ధర్నా నిర్వహించనున్నారు. దీంతో తెలంగాణ నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇక ఆగస్టు7న తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి సమర్పిస్తూ వినతిపత్రాలు అందజేయనున్నారు. ప్రతి జిల్లా నుంచి 25 మంది కీలక నేతలు ట్రైన్‌లో వెళ్లినట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.

Also Read This: Mulugu Development: ఫ‌లించిన సీత‌క్క పోరాటం.. ములుగు అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..