Pawan Kalyan: ఇప్పటికే వరుస సినిమాలతో జోష్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో తన పోర్షన్ కంప్టీట్ చేసుకున్నారు. తాజాగా దీనికి సంబందించి పోస్టర్ ను దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోసారి హరిష్ శంకర్, వవన్ కళ్యాణ్ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు బారీగా ఉన్నాయి. తాజాగా పవన్ ఫోర్షన్ కూడా పూర్తి చేసుకోవడంతో దాదపు సినిమా చాలా వరకూ అయిపోంయిందనే అంచనాలు ఉన్నాయి. ‘మాటిస్తే.. నిలబెట్టుకోడం, మాట మీదే.. నిలబడ్డం.. మీరు పక్కనుంటే కరెంటు పాకినట్టే’ అంటూ పవన్ కళ్యాణ్ రాసుకొచ్చారు. దీంతో అభిమానులు వనన్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
Read also- Meenakshi Natarajan: ఢిల్లీ వెళ్లిన మీనాక్షి నటరాజన్.. బీసీ నేతలతో రైలు ప్రయాణం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దేశభక్తుడైన ఓ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ గెటప్‌లో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీకి అయానక బోస్, ఎడిటింగ్‌కి ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు. దేశభక్తి, డైలాగ్ పంచ్‌లు, మాస్ ఎలిమెంట్స్ మేళవించిన ఈ సినిమా పవన్ ఫ్యాన్స్‌కి పండగలా ఉండనుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. మరో హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా తమిళ సినమా ‘తెరి’ రిమేక్ అనుకున్నా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టుడా మార్పులు చేశారని సమాచారం.
Read also- Viral News: పక్కా ప్లాన్‌తో భర్తను చంపించింది… ఎలా దొరికిపోయిందంటే?
‘హరి హర వీరమల్లు’తో మంచి హిట్ అందుకున్న పవన్‌కల్యాణ్ అదే జోష్‌తో ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ను పూర్తి చేశారు. ఆంధ్రపదేశ్ డిప్యూటీ సీఎంగా ఎంతో బిజీగా ఉంటూ ఈ సినిమా పూర్తి చేసినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. ఆయన సపోర్ట్ వల్లే ఈ షెడ్యూల్ త్వరగా పూర్తయినట్లు హరీశ్ తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయనతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ రోజును తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని దర్శకుడు తెలిపారు. పవన్ ఎనర్జీ సినిమాకు మరింత పవర్‌ను ఇచ్చిందన్నారు. సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం హరీశ్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో పవన్ సింపుల్ లుక్‌లో కనిపించడంతో అభిమానులు షేర్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.