Jacqueline Fernandez
ఎంటర్‌టైన్మెంట్

Jacqueline Fernandez: టాలీవుడ్‌కు వస్తున్న మరో బాలీవుడ్ బ్యూటీ.. ఆ దర్శకుడితో సినిమా!

Jacqueline Fernandez: బాలీవుడ్ నుంచి మరో హాట్ బ్యూటీ టాలీవుడ్‌కు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలు ఎందరో టాలీవుడ్ వైపు వస్తున్నారు. దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, సోనాక్షి సిన్హా వంటి హాట్ బ్యూటీలు ఇప్పటికే టాలీవుడ్‌లోకి అడుగు పెట్టేశారు. ఇప్పుడు శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టేందుకు అంతా సెట్టయింది. ఆ వివరాల్లోకి వెళితే..

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ యాక్టింగ్, యాక్షన్, డ్యాన్స్‌లతో టాప్ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో దూసుకెళుతోంది. జాక్వెలిన్ చేసిన ‘రేస్, రైడ్, వెల్కమ్, హౌస్‌ఫుల్, ఫతే’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పరిచయమే. ఆమె ‘సాహో’, ‘విక్రాంత్ రోణ’ చిత్రాలలో స్పెషల్ సాంగ్ చేసి తెలుగు ప్రేక్షకుల నుంచి గుర్తింపును పొందింది. ఇక ఇప్పుడామెకు డైరెక్ట్ తెలుగు సినిమాలో ఛాన్స్ వచ్చింది.

Also Read- Upasana: మెగా కోడలికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు.. చిరు రియాక్షన్ చూశారా?

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ త్వరలో వి. జయశంకర్ దర్శకత్వం వహించే మహిళా ప్రధాన చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు జయ శంకర్ విషయానికి వస్తే గతంలో ‘పేపర్ బాయ్’, ‘అరి’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పుడాయన జాక్వెలిన్‌తో ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే ఆయన జాక్వెలిన్‌కు యాక్షన్, సస్పెన్స్‌తో నిండిన ఒక ఇంటెన్స్ స్క్రిప్ట్‌ను వినిపించారని తెలుస్తోంది. జాక్వెలిన్‌కు జయశంకర్ చెప్పిన పాత్ర, కథ విపరీతంగా నచ్చినట్టుగా తెలుస్తోంది. స్క్రిప్ట్‌లో ఆమె పాత్రకు కొన్ని హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో పాటు, కథ అద్భుతంగా ఉండటంతో.. వెంటనే ఆమె ఓకే చెప్పినట్లుగా టాక్ నడుస్తోంది. ఫస్ట్ సిట్టింగ్‌లోనే జాక్వెలిన్ ఈ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇచ్చిందనేలా ప్రచారం జరుగుతోంది.

Also Read- Rajinikanth: ‘బాషా’ సినిమాకు ఆంటోని ఎలాగో.. ‘కూలీ’ సినిమాకు సైమన్ అలాగే.. నాగ్ అదరగొట్టేశాడు

జాక్వెలిన్‌ ఇది వరకు ఎప్పుడూ కనిపించని పాత్రలో ఈ ప్రాజెక్ట్‌లో కనిపించనుందని, ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుందని అంటున్నారు. స్క్రిప్ట్‌లో వీఎఫ్ఎక్స్‌కు సంబంధించిన వర్క్ కూడా చాలా ప్రాముఖ్యంగా ఉంటుందని, ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా థ్రిల్లింగ్ వీఎఫ్ఎక్స్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించేలా ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్. జాక్వెలిన్ పాన్ ఇండియా నటి కావడంతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మించనున్నారని కూడా తెలుస్తోంది. దర్శకుడు ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

మరో వైపు జాక్వెలిన్ టాలీవుడ్ ఎంట్రీ వార్త విన్నవారంతా.. దీపికా వచ్చేసింది, ఆర్ఆర్ఆర్‌తో ఆలియా వచ్చేసింది, SSMB29తో ప్రియాంకా చోప్రా వచ్చేస్తుంది. ఇప్పుడు జాక్వెలిన్.. నెక్ట్స్ ఎవరు వస్తారో అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. చూడాలి మరి.. ఈ వరుసలో నెక్ట్స్ వచ్చేది ఎవరో?

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

SCU: సుజీత్ సినిమాటిక్ యూనివర్స్.. దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారుగా..!

Arjun Das: ఓరి నీ అభిమానం చల్లగుండా.. మరీ ఇంత పెద్ద మెసేజ్ ఏంటయ్యా?

Sandeep Raj: ‘ఓజీ’ విడుదల వేళ.. 8 సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్‌‌‌తో సంచలనం!

O Cheliya Teaser: హీరో శ్రీకాంత్ వదిలిన ‘ఓ.. చెలియా’ టీజర్ ఎలా ఉందంటే?

Connplex Cinemas: ‘ఓజీ’ సినిమాతో హైదరాబాద్‌లో మరో లగ్జరీ మల్టీప్లెక్స్‌ ప్రారంభం.. వివరాలివే!