CM-Revanth-Reddy
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

CM Revanth: ఊరు,పేరు మార్చి కూల్చారు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy:

భారీ స్థాయిలో అక్రమాలు
లక్ష కోట్లు ప్రజాధనం వృథా
అసెంబ్లీలో కమిషన్ నివేదిక
చర్చ తర్వాత తదుపరి నిర్ణయం
కమిషన్‌ను తప్పుపట్టడం సరికాదు
రాజకీయ జోక్యం, వ్యక్తిగత కక్షలు లేవు
త్వరలో చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ రీడిజైనింగ్ పేరుతో మార్పులు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన మూడేళ్లల్లోనే మేడిగడ్డ కుంగిపోవడం, అన్నారం పగిలిపోవడం వంటివి జరిగాయన్నారు. 2015-16లో ప్రారంభించిన పనులు 2018-19లో పూర్తి చేసినట్లు గత ప్రభుత్వమే చెప్పిందని ఆయన తెలిపారు. సోమవారం ఆయన సచివాయంలో కేబినెట్ తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నిర్మాణం జరిగిన మూడేళ్లలోపే అంటే 2023లో మేడిగడ్డ కుంగిపోయిందని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో పగుళ్లు వచ్చాయని దుయ్యబట్టారు. భారీ స్థాయిలో అక్రమాలకు తెరలేపారని వివరించారు. ప్రణాళిక, నిర్మాణ, నిర్వహణ లోపాలు స్పష్టంగా ఉన్నాయని గతంలోనే కేసీఆర్‌కు నిపుణులు నివేదిక ఇచ్చారని, కానీ ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నట్లు కమిషన్ రిపోర్టు ఉన్నదన్నారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోవడంపై గతంలోనే తాము ప్రజలకు మాటిచ్చామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 14.03.2023న అపార అనుభవం ఉన్న పీసీ ఘోష్ చైర్మన్‌గా జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిషన్ నియమించామన్నారు. 16 నెలల తరువాత జులై 31 న 665 పేజీల నివేదికను పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అందించిందన్నారు. నివేదిక సారాంశాన్ని తయారు చేసి కేబినెట్‌కు అందించాలని ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ స్పష్టంగా తయారు చేసి కేబినెట్‌లో సమర్పించిందని అన్నారు. సుదీర్ఘ డిస్కషన్ తర్వాత కేబినెట్ ఆమోదించినట్లు సీఎం తెలిపారు.

అసెంబ్లీలో ప్రవేశపెడతాం…
రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలను తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. అసెంబ్లీలో అందరితో చర్చించిన తర్వాతనే తుది నిర్ణయం ఉంటుందన్నారు. బీఆర్ ఎస్ సహజంగానే ఈ రిపోర్టును తప్పుబడుతుందని, కానీ కమిషన్ ను తప్పుబట్టడం సరికాదన్నారు.న్యాయ నిపుణుడిగా అపారమైన అనుభవం కలిగిన వ్యక్తిని చైర్మన్‌గా నియమించామన్నారు. సుప్రీంకోర్టు జస్టీస్ , లోక్‌పాల్ చైర్ పర్సన్‌గా పనిచేసిన వ్యక్తిని విమర్శించడం బీఆర్‌ఎస్‌కు తగదన్నారు. నివేదిక బీఆర్‌ఎస్ అనుకూలంగా ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాట్లాడటం ఆ పార్టీ లీడర్లకు అలవాటే అని చెప్పారు. కమిషన్ నివేదికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదన్నారు. ఇది ఇండిపెండెంట్ జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన నివేదిక అంటూ సీఎం వివరించారు. నివేదిక సారాంశంపై అందరి సూచనల ప్రకారమే చర్యలు ఉంటాయన్నారు. పారదర్శకంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.భవిష్యత్ కార్యచరణపై ప్రభుత్వానికి ప్రత్యేక ప్లాన్ ఉన్నదన్నారు. తప్పకుండా జస్టిస్ ఘోష్​ కమిషన్​ నివేదికలోని సలహాలు, సూచనలను ప్రభుత్వం కచ్చితంగా పాటిస్తుందని సీఎం కుండబద్దలుకొట్టారు.

Read Also- GHMC: జీహెచ్ఎంసీ వసూళ్లలో అక్రమాలకు చెక్.. కుదిరిన ఒప్పందం

ఇక శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి సాగునీళ్లు ఇస్తామని ప్రాజెక్టు చేపట్టారని, కానీ ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయని సాంకేతిక నిపుణులు, ఎన్‌డీఎస్‌ఏ గుర్తించాయన్నారు. విచారణ చేసి ప్రణాళిక, నిర్మాణ, నిర్వహణ లోపాలున్నట్లు గుర్తించారని సీఎం రేవంత్ తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే నివేదికలు ఇచ్చారని,గతంలో ప్రతిపక్ష పార్టీ పక్షాన తాను భట్టి విక్రమార్క, ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు ప్రాజెక్టుల పర్యటనలు చేపట్టినట్లు గుర్తుచేశారు. లోపభూయిష్ట నిర్ణయాలు, అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్య వైఖరి గుర్తించామన్న ఆయన రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ము వృథాం చేసిన బీఆర్ ఎస్ పార్టీని క్షమించాల్సిన అవసరం లేదన్నారు. అసెంబ్లీ లో రిపోర్టు పై డిష్కసన్ తర్వాత తదుపరి చర్యలకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.

Read Also- GHMC: గూగుల్‌‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్న జీహెచ్ఎంసీ

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?