BRS protest (imagecredit:swetcha)
తెలంగాణ

BRS protest: కన్నెపెల్లి పంపు హౌస్ వద్ద ఉద్రిక్తత.. అడ్డుకున్న పోలీసులు

BRS protest: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్(Kannepalli Pump House) సందర్శన పేరుతో బీఆర్ఎస్(BRS) నేతలు నిర్వహించిన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పంపు హౌస్ లో మోటార్లను ప్రారంభించి కాళేశ్వరం ప్రాజక్టు నుండి నీళ్లను ఎత్తిపోసి రైతుల పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ నేతలు పంప్ హౌస్ గేటు ముందు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్(BRS) నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు(Putta Madhu) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతల పంపుహౌస్ సందర్శన కార్యక్రమం నిరసించారు.

నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం
పంపుహౌస్ అప్రోచ్ చానల్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి గోదావరి ప్రవాహాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar), ఎమ్మెల్సీ ఎల్ రమణ(MLC Ramana), మాజీ ఎంపి బోయినపల్లి వినోద్(Vinodh), మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు(Dhivakar), విద్యాసాగర్ రావు(Vidyasagar Rao), కోరుకంటి చందర్, రసమయి బాలకిషన్(Rasamayi Balakishan), రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి పరిశీలించారు. అక్కడి నుంచి మోటార్లు ఉన్న పంప్ హౌస్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బిఅర్ఎస్ నాయకులు గేట్‌ను తోసుకొని లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో బిఆర్ఎస్(BRS) నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పంపు హౌస్ మోటార్లను ఆన్ చేయకుంటే ఉద్యమానికి సిద్ధమవుతామని బిఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.

Also Read: Spain Airport: మీరేం తల్లిదండ్రులురా అయ్యా.. బిడ్డను అలా వదిలేశారు!

డౌన్ డౌన్ అంటూ నినాదాలు
బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) మాట్లాడుతూ పంపుహౌస్ వద్ద నీళ్లు ఉండి ఎత్తిపోతలు చేసే అవకాశం ఉంది. ఎత్తిపోతలు ప్రారంభించి రిజర్వాయర్, చెరువులు నింపే అవకాశం ఉంది కాబట్టి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మోటర్లు(Moters) ఆన్ చేయకుండా నీళ్లు నింపకుండ రైతులను ఇబ్బంది పేలుడుతుందని ఆరోపించారు. ఎన్డిఎస్ఏ(NDSA) రిపోర్ట్ ప్రకారం నీటి ఎత్తిపోతలు జరపరాదని ఈఎన్సీ తెలిపారని అన్నారు. యాజమాన్యం రిపేరు చేసుకోవచ్చు. ప్రభుత్వం ఆదేశిస్తే ఎల్అండ్టీ సంస్థ(L&T Company) రిపేరు చేసి నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా నీరు ఎత్తిపోయకుండా రైతులను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు
కన్నెపల్లి పంపుహౌస్‌లో వారం రోజుల్లో నీళ్లు ఎత్తిపోతలు ప్రారంభించాలి. లేకుంటే బీఆర్ఎస్ పక్షాన కేసిఆర్(KCR), కేటిఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)ల ఆదేశాలమేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్(Uttam Kumar) ఈ రోజు జరిగిన విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. వెంటనే పంపుహౌస్ మోటార్లను ఆన్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

Also Read: Telangana: ఆ విషయంలో తెలంగాణను ఢీకొట్టే రాష్ట్రమే లేదు.. దేశంలోనే నెంబర్ వన్!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు