ktr
Politics

KTR: రాజీనామాకు సై

– బీఆర్ఎస్ హయాంలో రికార్డ్ స్థాయిలో ఉద్యోగాలిచ్చాం
– ఇది నిజం కాదని నిరూపించే దమ్ము ఉందా?
– కాంగ్రెస్, బీజేపీకి కేటీఆర్ సవాల్
– నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం

Telangana: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఢీలా పడ్డ బీఆర్ఎస్, పార్లమెంట్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానమైన వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నిక రావడంతో దాన్ని కూడా గెలుస్తామని అంటోంది. ఈ నెల 27న జరగనున్న ఎన్నిక కోసం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నర్సంపేటలో పర్యటించారు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశంలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఏ రాష్ట్రమూ ఇవ్వలేదన్న ఆయన, ఇదే నిజం కాదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో మరే రాష్ట్రం కూడా సృష్టించనన్ని ఉద్యోగాలను తెలంగాణలో కల్పించిందని వివరించారు. బీఆర్ఎస్ చెప్పిన మాటలను నమ్మకుండా కాంగ్రెస్‌కు ఓటు వేసి రాష్ట్ర ప్రజలు మోసపోయారని కేటీఆర్ అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎన్ని, ఇప్పుడు అమలు చేస్తున్నవెన్ని అని ప్రశ్నించారు. డిసెంబర్ 9 తర్వాత నెరవేరుస్తామన్న హామీల్లో ఎన్ని అమలు చేశారని అడిగారు. రైతు రుణమాఫీ ఏమైంది? మహిళలకు రూ.2,500 ఏమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మహిళలకు ఆర్టీసీల్లో ఉచిత బస్సు సౌకర్యాన్ని తెచ్చారని, దీంతో మహిళలు కొట్టుకుంటున్నారని, మగవాళ్లు తిట్టుకుంటున్నారని అన్నారు.

బీఆర్ఎస్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉన్నదో గమనించాలని కేటీఆర్ సూచించారు. బీఆర్ఎస్ పాలనలో రెప్పపాటు కాలమైనా కరెంట్ పోయిందా అని అడిగారు. వరంగల్ ఎంజీఎంలో రెండు గంటల కరెంట్ పోతే దిక్కులేదని ఆగ్రహించారు. కరెంట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. కాబట్టి మరోసారి కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మాట తప్పిన ఆ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వచ్చే నష్టమేమీ లేదని, అది ప్రజలకే నష్టంమని అన్నారు. ఈ విషయం గ్రహించి ఓటు వేయాలని చెప్పారు. ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి జర్నలిజం ముసుగులో దందాలకు పాల్పడే తీన్మార్ మల్లన్న అని, ఆయనకు ఓటు వేస్తే అది ఖరాబ్ చేసుకున్నట్టే అని విమర్శించారు.

Just In

01

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?