Ustad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక యాక్షన్ కామెడీ డ్రామా చిత్రం. ఈ మూవీలో శ్రీలీల, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: Tamannaah Bhatia: హీరోయిన్స్ కాస్మెటిక్ సర్జరీలపై ప్రశ్న.. బుర్రబద్దలయ్యే ఆన్సర్ ఇచ్చిన తమన్నా!
ఈ చిత్రం గబ్బర్ సింగ్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తున్న రెండో చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల క్లైమాక్స్ షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది భావోద్వేగాలతో కూడిన యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంటుందని తెలిపారు. ఈ సినిమా 2026లో విడుదల కానుంది, అయితే కొన్ని సోర్సెస్ ప్రకారం నవంబర్ 14, 2025న విడుదల అవుతుందని పేర్కొన్నాయి. ఈ చిత్రం తమిళ చిత్రం తెరి రీమేక్ కాదని, ఒరిజినల్ కథతో వస్తుందని రచయిత దాసరథ్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతల మధ్య కూడా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ సినీ కార్మికుల సమ్మెతో చిక్కుల్లో పడింది. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయినప్పటికీ, కొన్ని ప్యాచ్ వర్క్‌లు ఇంకా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే , స్థానిక కార్మికుల సమ్మె కారణంగా నిర్మాతలు ముంబై, చెన్నై నుంచి వర్కర్స్‌ను తెప్పించి షూటింగ్‌ను కొనసాగిస్తున్నారు.
Also Read: Viral Vayyari song: సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేసిన ‘వైరల్ వయ్యారి’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..
ఈ విషయం తెలిసిన టాలీవుడ్ ఫెడరేషన్ యూనియన్ సభ్యులు షూటింగ్‌ను అడ్డుకునేందుకు సెట్‌కు చేరుకున్నారు. సమ్మె సమయంలో షూటింగ్ ఎలా కొనసాగిస్తారని మేకర్స్‌ను యూనియన్ సభ్యులు నిలదీసినట్లు సమాచారం. ఈ పరిణామాలతో సెట్‌లో కాస్త ఉద్రిక్తత నెలకొన్నట్లు తెలుస్తోంది. “మన స్థానిక కార్మికుల కష్టానికి విలువ లేదా? పవన్ కళ్యాణ్‌కు ఈ విషయం తెలియదా?” అంటూ యూనియన్ సభ్యులు కూడా మండిపడుతున్నారు. ఈ గొడవతో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌పై మరింత ఉత్కంఠ నెలకొంది.