Mahavatar Narsimha: యానిమేషన్ మహావతార్ నరసింహ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిన్న సినిమాగా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో, క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. జూలై 25న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, రిలీజ్ అయిన దగ్గర నుంచి దూసుకుపోతోంది.
Also Read: Viral Vayyari song: సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేసిన ‘వైరల్ వయ్యారి’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..
తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి విడుదలైన మహావతార్ నరసింహ, యానిమేషన్, భక్తి శ్రేణి చిత్రమైనప్పటికీ, పవర్‌ఫుల్ కమర్షియల్ సినిమా అనుభవాన్ని అందించింది. ముఖ్యంగా, సినిమా చివరి అరగంటలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. సైలెంట్‌గా రిలీజైన ఈ మూవీ, రెండో రోజు నుంచి మౌత్‌టాక్‌తో ఊపందుకుని, థియేటర్లలో ఇప్పటికీ దూసుకెళ్తుంది.
Also Read: Parents: పిల్లలు బాగుండాలనే తపన తల్లిదండ్రులది.. మరి పిల్లల ఆలోచనా విధానం ఎలా ఉందంటే?
సినిమా పెద్ద విజయం సాధించడంతో తెలుగులో కూడా ఈ సినిమా సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. కేవలం 6 అంటే 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మహావతార్ నరసింహ, ఇప్పటి వరకు ఏకంగా రూ.105 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, రాకెట్ వేగంతో దూసుకుపోతుంది.
Also Read: Anasuya Bharadwaj: నా భర్త ఆ విషయంలో పర్ఫెక్ట్ కాదు.. హీరోలతో రొమాన్స్ చేస్తా.. అనసూయ కామెంట్స్
ఈ అద్భుతమైన కలెక్షన్స్‌తో, రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఫస్ట్ ఇండియన్ యానిమేటెడ్ చిత్రంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ వసూళ్లు రాబోయే రోజుల్లో మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది. మహావతార్ నరసింహ.. థియేటర్లలో ఇప్పటికీ సందడి చేస్తూ, యానిమేషన్ సినిమాలకు కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తుంది.
Roaring past records with divine force 🦁❤️🔥#MahavatarNarsimha crosses 105 CRORES+ GBOC India, setting the box office ablaze with unstoppable momentum.
A divine phenomenon awaits you in cinemas.#Mahavatar @hombalefilms @AshwinKleem @kleemproduction @VKiragandur @ChaluveG… pic.twitter.com/LbEdQBZyjo
— Hombale Films (@hombalefilms) August 4, 2025