BC Reservation Bill( IMAGE credit: twittwer)
Politics, లేటెస్ట్ న్యూస్

BC Reservation Bill: 6న జంతర్ మంతర్ వద్ద బీసీ బిల్లుపై ధర్నా

BC Reservation Bill: ఈ నెల 6న ఢిల్లీలో‌ని జంతర్ మంతర్ వద్ద జరగబోయే ధర్నాకు కీలక నాయకులంతా హాజరు కావాలని టీపీసీసీ(TPCC) ఆదేశాలిచ్చింది. దీంతో పాటు ప్రతీ జిల్లా నుంచి 25 మంది ముఖ్య నేతలు తప్పనిసరిగా రావాల్సిందేనని టీపీసీసీ సూచించింది. ఈ మేరకు ఢిల్లీ(Delhi)కి హాజరు కాబోయే నేతల వివరాల లిస్టు గాంధీభవన్‌కు పంపించాలని అన్ని జిల్లాల డీసీసీలకు పీసీసీ(pcc) చీఫ్​ ఆదేశాలిచ్చారు. ఢిల్లీ ధర్నా పాస్‌ల కోసం వివరాలు కోరారు. ఇక ఆయా నేతల ఢిల్లీ(Delhi) ప్రయాణం కోసం ప్రత్యేక రైల్‌ను బుక్ చేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్(Cherlapalli Railway Station)నుంచి ఢిల్లీకి నేతలను తరలించనున్నారు.

Also Read: Viral Vayyari song: సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేసిన ‘వైరల్‌ వయ్యారి’ ఫుల్‌ వీడియో సాంగ్ వచ్చేసింది..

ఆధార్ కార్డు తప్పనిసరి

ఢిల్లీ(Delhi)కి వెళ్లబోయే బీసీ నేతలు తప్పనిసరిగా ఈ రోజు ఉదయం 9 గంటలకు స్టేషన్‌లో ఉండాలని, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందేనని పార్టీ ఆదేశించింది. మూడు రోజుల పాటు ప్రోగ్రామ్ అయ్యే వరకు ఆయా నేతలను కో ఆర్డినేషన్ కోసం గాంధీభవన్ నుంచి ప్రత్యేక టీమ్‌లను నియమించారు. బీసీ 42 శాతం రిజర్వేషన్ల అమలుకై ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ(Congress party)ధర్నాకు పూనుకున్నది. చేయి చేయి కలుపుదాం.. బీజేపీ(Bjp) మెడలు వంచుదాం అనే ట్యాగ్‌లైన్‌తో నిరసన చేపట్టనున్నారు.

కుల గణన చేయాల్సిందే

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు, పంచాయతీ రాజ్ చట్టం సవరణ ఆర్డినెన్స్‌ను ఎందుకు నిలిపివేశారో? సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేయనున్నది. ఇక దేశ వ్యాప్తంగా కుల గణన చేయాల్సిందే అంటూ పార్టీ పట్టుపట్టనున్నది. దీనిలో భాగంగా మూడు రోజుల పాటు పార్టీ ప్రోగ్రామ్‌లకు పిలుపునిచ్చింది. ఈ నెల 5న పార్లమెంట్‌లో వాయిదా తీర్మానంతో పాటు ఈ నెల 6న మహా ధర్నా, ఈ నెల 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాన్ని అందించనున్నారు. ఢిల్లీ(Delhi) గల్లీల్లోనే నేతల నిరసనలు వినిపించేలా హడావుడి చేయాలని పార్టీ ప్లాన్ చేసింది.

ఏఐసీసీ ఇన్‌ఛార్జ్, పీసీసీ చీఫ్‌లు సైతం
ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్,(Meenakshi Natarajan)పీసీసీ చీఫ్‌లు సైతం రైలులోనే ఢిల్లీకి ప్రయాణించనున్నారు. బీసీ బిల్లు అమలు చేసి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 5, 6, 7 తేదీలలో ఢిల్లీ(Delhi) లో ఉద్యమ కార్యాచరణను సక్సెస్ చేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందని మండిపడ్డారు. ఆర్డినెన్స్ సవరణ లేనందున స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించలేని పరిస్థితి వచ్చిందన్నారు. దేశ వ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వానికి వివక్ష ఉన్నదని, అందుకే రాష్ట్రపతి, గవర్నర్‌లకు పరోక్షంగా ఆదేశిస్తూ కేంద్రం అడ్డుకున్నదని పీసీసీ చీఫ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Also Read: Anasuya Bharadwaj: నా భర్త ఆ విషయంలో పర్ఫెక్ట్ కాదు.. హీరోలతో రొమాన్స్ చేస్తా.. అనసూయ కామెంట్స్

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!