Kaleshwaram project(image CREDIT: TWITTER)
Politics, లేటెస్ట్ న్యూస్

Kaleshwaram project: సీఎంతో ఉత్తమ్ కమిటీ సభ్యులు భేటీ

Kaleshwaram project: కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై త్రిసభ్య కమిటీ అధ్యయనం చేసింది. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)తో సీఎస్ రామకృష్ణారావు,(Ramakrishna Rao)నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా,(Rahul Bojja) సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి నవీన్‌మిట్టల్‌, న్యాయ శాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతి భేటీ అయ్యారు. సుధీర్ఘంగా చర్చించారు. నివేదికలోని సారాంశంకు సంబంధించిన ముసాయిదాను ఉత్తమ్‌కు అందజేశారు.

 Also Read: KCR on Jagadish reddy: ప్రతికూల పరిస్థితుల నుంచి విముక్తి కోసమేనా?

కీలక అంశాలపై చర్చ

అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో భేటీ అయ్యి చర్చించారు. క్యాబినెట్‌లో చర్చించాల్సిన అంశాలపైనా ఉత్తమ్ వివరించారు. మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశాన్ని సచివాలయంలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కాళేశ్వరం నివేదికను క్యాబినెట్‌లో పెట్టనున్నారు. పూర్తి స్థాయిలో నివేదికలోని కీలక అంశాలపై చర్చించనున్నారు. కమిషన్ నివేదికపై ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు డిజైన్, లోకేషన్ మార్పు సంబంధించిన అంశాలతో పాటు కేసీఆర్,(KCR హరీశ్,(Harish) ఈటల రాజేందర్(Etala Rajender)మంత్రులుగా అనుసరించిన విధానంను వివరించనున్నట్లు సమాచారం. అయితే క్యాబినెట్‌లో కాళేశ్వరంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

 Also Read: Commodities Prices: కొండెక్కిన పప్పులు కూరగాయల ధరలు.. తినేదెలా తెచ్చేదెలా!

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు