KCR: మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి బీఆర్ఎస్(Brs)అధినేత కేసీఆర్(Kcr) క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. జగదీష్ రెడ్డి(Jagadish Reddy) చేసిన వ్యాఖ్యలపై కవిత ఘాటుగా స్పందించారు. తనదైన శైలీలో కవిత విమర్శలు చేశారు. ఆయన నల్లగొండలో పార్టీ ఓటమికి కారణమని, ఆయనే చావుతప్పి గెలిచాడని విమర్శలు చేసింది. దీంతో ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) హుటాహుటినా వెళ్లారు. దీంతో కేసీఆర్(Kcr) సీరియస్ అయినట్లు సమాచారం. కవిత(Kavitha)పై ఎందుకు వ్యాఖ్యలు చేశావని నిలదీసినట్లు ప్రచారం జరుగుతున్నది.
Also Read: Hero Krishnasai: సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు హీరో కృష్ణసాయి ఏం చేశారో చూశారా?
కవిత(Kavitha) అంశం తాను చూసుకుంటానని చెప్పినప్పటికీ ఆమెపై ఎందుకు స్పందించామని జగదీష్ రెడ్డి(Jagadish Reddy)ని ప్రశ్నించినట్లు సమాచారం. మరోసారి వ్యాఖ్యలు చేయొద్దని సూచించినట్లు తెలిసింది. కేసీఆర్(Kcr) ఆదేశాలతోనే మళ్లీ భవన్‌కు వచ్చి మీడియాతో జగదీష్ రెడ్డి(Jagadish Reddy)మాట్లాడినట్లు సమాచారం. మీడియా ముందు జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ముఖం పాలిపోయినట్లు కొట్టొచ్చినట్లు కనబడింది. ఎప్పుడైనా ముఖం కలకలలాడేది. అయితే, ముఖ కవలికల్లోనూ తేడా రావడంతో గులాబీ నేతల్లోనూ చర్చకు దారితీసింది. గతంలో మీడియా ముందుకు విమర్శలకు పదును పెట్టే ఆయన.. ఈ స్థాయిలోనూ మాటలు లేకుండా సున్నితంగా మాట్లాడటంపై నేతలే చర్చించించుకుంటున్నారు.
Also Read: Viral News: బాస్మతి రైస్‌పై డిస్కౌంట్ ప్రకటన.. మాల్‌లో ఊహించని సీన్