Telangana: అవయవదానంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 2024లో దేశంలో ప్రతి పది లక్షల జనాభాకు సగటున 0.8 అవయవదానాలు జరగగా, తెలంగాణలో ఇదే సంఖ్య 4.88గా నమోదైంది. ఈ ఘనతకు గుర్తింపుగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ తెలంగాణకు అవార్డు ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన జాతీయ అవయవదాన దినోత్సవ వేడుకల్లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఈ అవార్డును జీవన్‌దాన్ ప్రతినిధులకు అందజేశారు.
Also Read: Excise Raids: బర్త్ డే పార్టీలో డ్రగ్స్ కలకలం.. ఆరుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల అరెస్ట్
ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. పేద, ధనిక తేడా లేకుండా అవసరమైన వారందరికీ అవయవాలు అందించేందుకు ఇటీవల ‘తోట యాక్ట్’ను కూడా అనుసరించినట్లు ఆయన తెలిపారు. బ్రెయిన్ డెత్ కేసులలో అవయవాలు వృథా కాకుండా దానం చేయాలని మంత్రి ప్రజలను కోరారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అవయవ మార్పిడి చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. 2024లో తెలంగాణలో 188 మంది బ్రెయిన్ డెత్ డోనర్ల నుంచి 725 అవయవాలను సేకరించి, వాటిని ఇతరులకు అమర్చి ప్రాణాలను కాపాడగలిగామని మంత్రి వివరించారు.