Sushanth Bharadwaj: నా భర్త ఆ విషయంలో పర్ఫెక్ట్ కాదు?
Anasuya Bharadwaj ( Image Source: Twitteer)
ఎంటర్‌టైన్‌మెంట్

Anasuya Bharadwaj: నా భర్త ఆ విషయంలో పర్ఫెక్ట్ కాదు.. హీరోలతో రొమాన్స్ చేస్తా.. అనసూయ కామెంట్స్

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్, యాంకర్‌గా బుల్లితెర మీద దూసుకెళ్తూ.. ఇంకో వైపు సినీ ఇండస్ట్రీలో కూడా తన నటనతో మంచి గుర్తింపు పొందింది. ఆమె నటిగా ‘రంగమ్మత్త’, ‘ద్రాక్షాయిణి’ వంటి పాత్రలతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసి, వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంది.

Also Read: Dharmasthala Case: ధర్మస్థల కేసులో ఆసక్తికర పరిణామం.. ప్రత్యక్ష సాక్షికి సిట్ కీలక ఆదేశాలు!

అయితే, ఆమె తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనసూయ మాట్లాడుతూ, “ప్రజలు నా భర్తను చాలా మంచివాడిగా భావిస్తారు. ఎందుకంటే, నేను హీరోలతో రొమాంటిక్ సీన్స్‌లో, ఐటెం సాంగ్స్‌లో నటించాను, చిన్న చిన్న బట్టలు వేసుకున్నాను. ఇవన్నీ చూసి, ‘అనసూయ (Anasuya Bharadwaj)భర్త ఎంత ఓపికగలవాడు, ఏమీ అనడు’ అని కొందరు అనుకుంటారు. మరికొందరు మాత్రం, ‘అతను చేతకానివాడు, అందుకే సైలెంట్ గా ఉంటాడు’ అని విమర్శిస్తారు. కానీ, నా భర్త ఎలాంటి వాడో నాకే తెలుసు.. ఆయనేం అంత ‘పర్ఫెక్ట్’ కాదు, అతను కూడా అందరి లాగే ” అని వెల్లడించింది.

Also Read: Nitin Gadkari: కేంద్రమంత్రి నివాసంలో బాంబు పెట్టా.. 10 నిమిషాల్లో పేలుతుందంటూ ఫోన్‌కాల్..

ఆమె మాటల్లో అంతరార్థం ఏమిటంటే, తన భర్త సుశాంత్  (Sushanth Bharadwaj) కూడా తన నటనా ఎంపికలపై అసంతృప్తి వ్యక్తం చేస్తాడని, ముఖ్యంగా హీరోలతో రొమాంటిక్ సీన్స్‌లో నటించడం ఆయనకు అసలు నచ్చదని చెప్పింది. ” నేను అలా చేసినప్పుడు చాలాసార్లు విషయంలో మా మధ్య గొడవలు జరిగాయి. నేను ఇతర హీరోలతో సన్నిహితంగా నటించడం ఆయనకు ఇష్టం ఉండదు. నేను ఆయన గురించి ఎలా ఫీలవుతానో, ఆయన కూడా నా గురించి అలాగే ఫీలవుతాడు. అయినప్పటికీ, మా ఇద్దరి మధ్య పెళ్లి మీద ఉన్న నమ్మకం వలన కలిసి బతుకుతున్నాం. అని ఆమె మాటల్లో చెప్పుకొచ్చింది.

Also Read: Parents: పిల్లలు బాగుండాలనే తపన తల్లిదండ్రులది.. మరి పిల్లల ఆలోచనా విధానం ఎలా ఉందంటే?

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..