Gurukulam(Image CREDIT: Twitter)
తెలంగాణ

Gurukulam: హెల్తీ హైజీన్ కోసం సర్కార్ కీలక నిర్ణయం

Gurukulam: గురుకులాల పుడ్ పాయిజన్‌కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి ప్రతీ మూడు నెలలకోసారి ర్యాండమ్‌గా(Gurukulam) గురుకులాల్లోని ఫుడ్‌ను పరీక్షించనున్నారు. పుడ్ సేప్టీ ఆధ్వర్యంలో శాంపిల్స్ సేకరణ, పరీక్షలు నిర్వహించనున్నారు. తప్పిదం, నిర్లక్ష్యం తేలితే వెంటనే సంబంధిత కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోనునున్నారు. దీంతో పాటు పుడ్ పాయిజన్ జరిగిన గురుకులాల్లోనూ వెంటనే పుడ్ సేప్టీ పరీక్షలు చేయనున్నది. కల్తీ ఆహారంగా నిర్ధారణ అయితే కూడా చర్యలు తీసుకోనున్నారు.

 Also Read: Dharmasthala Case: ధర్మస్థల కేసులో ఆసక్తికర పరిణామం.. ప్రత్యక్ష సాక్షికి సిట్ కీలక ఆదేశాలు!

ఆ కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టడమే కాకుండా, చట్టపరంగా క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆహర పంపిణీపై మరింత బాధ్యతగా వ్యవహరిస్తారనేది ప్రభుత్వం ఉద్దేశ్యం. ఇప్పటికే కిచెన్ లలో సీసీ కెమెరాలు పెట్టాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..తాజాగా కాంట్రాక్ట్ రద్దుకు డిసిషన్ తీసుకోవడం హాట్ టాఫిక్‌గా మారింది. ఇప్పటి వరకు ఇలాంటి నిర్ణయం జరగలేదు. ఫస్ట్ టైమ్ తీసుకున్నట్లు గురుకుల సంస్థ అధికారులు చెప్తున్నారు.దీంతో పాటు విద్యార్ధుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా పెట్టనున్నారు. విద్యార్థులు, పేరెంట్స్ నుంచి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఉన్నతాధికారులు ఫిర్యాదులు తీసుకోనున్నారు. ప్రతీ ఫిర్యాదుకు 48 గంటల్లోనే పరిష్కారం లభించేలా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు. త్వరలోనే టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రకటించనున్నారు.

సెప్లెంబర్ 5 నుంచి సెంట్రలైజ్డ్ సిస్టమ్?
సెప్టెంబర్ 5 నుంచి సెంట్రలైజ్ట్ ప్రోక్యూర్‌మెంట్ పాలసీని అమలు చేయనున్నారు. ఈ పాలసీ ప్రకారం అన్ని గురుకులాల్లో ఒకే రకమైన నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన స్నాక్స్, కిచెన్ వంటివన్నీ మెయింటెన్ చేయాలి. ఇటీవల ప్రభుత్వం జీవోను కూడా రిలీజ్ చేసింది. దీని వలన రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న లక్షలాది విద్యార్థులకు రుచికరమైన, పరిశుభ్రమైన, పోషకవిలువలతో కూడిన భోజనం అందించడం సాధ్యమవుతుంది. ‘హెల్తీ – హైజీన్ – టేస్టీ ఫుడ్’ అనే ట్యాగ్ లైన్‌తో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీని ప్రభుత్వం అమలు చేయనున్నది. అంతేగాక పారదర్శక టెండర్ విధానాన్ని పాటించినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు ఆధునిక వంటలు, క్వాలిటీ ఫుడ్‌పై నేషనల్ న్యూట్రిష్ సంస్థ సహకారం కూడా తీసుకున్నట్లు తెలిపారు.

దీని వలన విద్యార్థుల్లో మానసిక స్థితి మరింత బలంగా మారుతుందని ఆఫీసర్లు వివరిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు జిల్లాల వారీగా వేర్వేరుగా సప్లై జరిగేవి. దీని వలన నాణ్యతలో లోపాలు, రేట్లలో భేదాలు, సరఫరాలో ఆలస్యం, పదార్ధాల క్వాలిటీ తగ్గిపోవడం వంటి సమస్యలు ఉండేవి. కానీ, కొత్త విధానంతో ఒకే ప్రమాణాన్ని ఒకే రేట్‌కు కొనుగోలు చేసి జిల్లాలకు పంపే విధానం అమల్లోకి రానున్నది. దీని ద్వారా సప్లై సజావుగా జరగడమే కాకుండా క్వాలిటీ కూడా మెరుగుపడుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల మెడిసిన్ సప్లైలో ఈ విధానాన్ని అనుసరిస్తుండగా, గురుకులాల్లోని ఫుడ్ పంపిణీకి కూడా అమల్లోకి తేనున్నారు.

డాష్​ బోర్డు మానిటరింగ్ సిస్టం
= గురుకుల సంస్థ సెక్రెటరీ అలగు వర్షిణి
‘క్వాలిటీ, క్వాంటిటీ, టైమ్ అనే మూడింటినీ పర్‌ఫెక్ట్‌గా మెయింటెన్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఫుడ్ సరఫరా చేసే ఏజెన్సీలు నాణ్యత, పరిమాణం, సమయపాలన తప్పనిసరిగా పాటించాలి. ఇందుకోసం డాష్‌బోర్డు మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశాం. ఏ రోజు ఏ పదార్థం ఎంత వాడారో, మెనూ పూర్తిగా అమలు అవుతుందా? అనే విషయాలన్నీ రియల్ టైమ్ ఆన్‌లైన్‌లో కనిపించేలా టెక్నాలజీ సహాయంతో చర్యలు తీసుకున్నాం. అంతేగాక ట్రాకింగ్ సిస్టంను కూడా అమలు చేస్తున్నాం. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక టీమ్‌లు పర్యవేక్షిస్తాయి. దీంతో పాటు ఆహార నాణ్యత కోసం స్టీమ్ కుకింగ్ తప్పనిసరి చేశాం. వండిన పదార్థాలను స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలలోనే నిల్వ చేయాలని ఆదేశాలిచ్చినం. ప్లాస్టిక్, అల్యూమినియం పాత్రలకు పూర్తిగా నిషేదించబోతున్నం. ఇది విద్యార్థుల ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుంది’.

 Also Read: Excise Raids: బర్త్ డే పార్టీలో డ్రగ్స్ కలకలం.. ఆరుగురు సాఫ్ట్‌వేర్​ ఉద్యోగుల అరెస్ట్

Just In

01

Man Kills Wife: ప్రియుడితో దొరికిన భార్య.. తలలు తెగ నరికి.. బైక్‌కు కట్టుకెళ్లిన భర్త

Nepal Interim Government: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఎలక్ట్రికల్ ఇంజనీర్.. ఎవరీ కుల్మన్ ఘిసింగ్?

Bigg Boss Telugu 9: రొమాంటిక్ మాటలతో రెచ్చిపోయిన రీతూ చౌదరి.. ప్రోమోలో హైలెట్ అదే?

Bihar Elections 2025: బీహార్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ లీడర్లు.. సెలక్షన్ ప్రాసెస్ షురూ

Telusu Kada Teaser: సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా టీజర్ వచ్చేసింది.. చూడాలంటే ‘తెలుసు కదా’?