Satyadev
ఎంటర్‌టైన్మెంట్

Satyadev: మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుందని అంటారు కదా! అలాగే?

Satyadev: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘కింగ్‌డమ్’ (Kingdom). గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమా జూలై 31వ తేదీన విడుదలై పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్, విజయ్ అన్నదమ్ములుగా నటించారు. తాజాగా ఈ చిత్రంలో శివ పాత్రలో నటించిన సత్యదేవ్.. సినిమా సక్సెస్‌ను మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ..

‘‘ఇప్పటి వరకు ఈ సినిమాకు వచ్చినన్ని ఫోన్ కాల్స్.. ఏ సినిమాకు రాలేదు. మొదటి షో నుంచే అందరూ ఫోన్ చేసి అభినందిస్తున్నారు. గౌతమ్ నాకు ఈ కథ చెప్పగానే ఎలాంటి లెక్కలు వేసుకోకుండా వెంటనే ఓకే చెప్పేశాను. నాకు ఈ కథ అంత నచ్చింది. నా నమ్మకం నిజమై, ఇప్పుడు సినిమాకు ఇంతటి ఆదరణ లభిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాకు నాకు పేరొచ్చింది కానీ, అది జనాల్లోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకుంది. భారీతనంతో పాటు విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వంటి అంశాలు ఈ సినిమాకు కలిసి రావడంతో, ‘కింగ్‌డమ్’ సినిమా తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి రీచైంది. ఈ సినిమా సక్సెస్‌తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇందులోని శివ పాత్ర కోసం మొదట గౌతమ్ నా పేరే రాసుకున్నాడట. కానీ, కొన్ని కారణాల వల్ల ఆయన నన్ను సంప్రదించలేదు. మధ్యలో వేరే వాళ్లతో కూడా చేద్దామనుకున్నారట. సరిగ్గా షూటింగ్‌కి వెళ్ళడానికి ముందు గౌతమ్ నన్ను కలిసి నాకు ఈ కథ చెప్పారు. కథ విపరీతంగా నచ్చి, వెంటనే సినిమా చేస్తానని చెప్పాను. అప్పుడు గౌతమ్ ఓ మాట అన్నారు.. ‘శివ పాత్ర కోసం నేను మొదట ఎవరి పేరు అయితే రాసుకున్నానో.. వాళ్ళతోనే చేస్తుండటం సంతోషంగా ఉంది’ అని చెప్పారు. అప్పుడు నాకు కూడా అనిపించింది.. ‘మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుంది అని పెద్దవారు అంటుంటారు కదా’.. అలాగే ఏ పాత్ర ఎవరు చేయాలనేది కూడా ముందే రాసి పెట్టి ఉంటుందేమో అనిపించింది.

Also Read- Allu Aravind: ‘మహావతార్ నరసింహ’ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చూడాలని కోరుకుంటున్నా!

ఎప్పుడైనా యాక్షన్ సీన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలంటే.. ఆ సీన్ వెనుక బలమైన ఎమోషన్ ఉండాలని నేను నమ్ముతాము. ఇందులో అలాంటి ఎమోషన్ బాగా పండింది కాబట్టే.. నా యాక్షన్ సీన్స్‌కి అంత మంచి స్పందన వస్తోంది. విజయ్ దేవరకొండ నా తమ్ముడని తెలిసిన తర్వాత.. జైల్లో మా ఇద్దరి మధ్య సంభాషణ ఉంటుంది. తమ్ముడంటే మనసులో ఎంతో ప్రేమ ఉంది.. కానీ పైకి మాత్రం అది పూర్తిగా చూపించకూడదు. ఎందుకంటే, నా తమ్ముడిపై ఉన్న ప్రేమ చూపిస్తే అతను కూడా నాతో ఉండిపోతానని అంటాడేమో అనే భయం నాలో ఉంటుంది. అసలు గౌతమ్ నా పాత్రను మలిచిన తీరే అద్భుతంగా ఉంటుంది. ఓ వైపు తమ్ముడు, మరోవైపు దివి ప్రజలు, ఇంకో వైపు నాకు ఒక నిజం తెలుసు కానీ ఎవరికీ చెప్పలేను.. ఇలా నా పాత్ర చుట్టూ ఎంతో ఎమోషన్‌కు స్పేస్ ఉంది. అందుకే సినిమాలో డ్రామా అంతగా పండింది. సినిమాలో ఫిజికల్‌గా ఛాలెంజింగ్ అనిపించిన సీన్ మాత్రం ప్రీ క్లయిమాక్స్ ఎపిసోడే. ఇప్పుడా ఎపిసోడ్‌కు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూశాక, ఆ కష్టమంతా మరిచిపోయాను. సినిమాలో ఉన్న హైలైట్స్‌లో బోట్ సీక్వెన్స్ కూడా ఒకటి.. ఆ సీక్వెన్స్ కోసం కూడా చాలా అంటే చాలా కష్టపడ్డాం. నిజానికి నాకు బోట్ డ్రైవింగ్ రాదు. కానీ, నన్ను నమ్మి విజయ్ బోట్‌లో కూర్చోవాలి. ఆ నీటి ప్రవాహానికి తగ్గట్టుగా దానిని నడపడం అంత ఈజీ కాదు. కుడి వైపుకి తిప్పితే ఎడమ వైపుకి.. ఎడమ వైపుకి తిప్పితే కుడి వైపుకి పోతుంది. మొదట చాలా భయమేసింది. ఆ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో కొన్ని ప్రమాదాల నుంచి కూడా బయటపడ్డాం. ఓసారి చెట్ల కొమ్మల్లోకి వెళ్ళిపోయాం. మరోసారి చెట్టు మీద పడేది. దాంతో బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ బోట్ నడిపాను.

ఈ సినిమాలో విజయ్‌కి, నాకు ఎంతో పేరు వచ్చిందో.. తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన వెంకటేష్‌కి కూడా అంత పేరు వచ్చింది. నిజంగానే అతను అద్భుతంగా నటించాడు. షూటింగ్ సమయంలోనే బాగా నటిస్తున్నాడని మేమంతా అనుకున్నాం. ఇప్పుడదే మాట ప్రేక్షకులు కూడా చెప్తున్నారు. ఒక కొత్త నటుడికి ఇంత పేరు రావడం అంటే.. ఇప్పుడున్న కాంపిటేషన్‌లో మామూలు విషయం కాదు. విజయ్ దేవరకొండ గురించి చెప్పాలంటే నాకు అంతకుముందు అతనితో పరిచయం లేదు. అతన్ని కలిసిన తర్వాత తెలిసింది చాలా మంచి వ్యక్తి అని. చాలా తక్కువ సమయంలోనే మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. విజయ్‌ని నేను నిజంగానే ఒక బ్రదర్‌లా ఫీల్ అయ్యాను. విజయ్ మంచి వ్యక్తి కావడం, నాతో అంత మంచిగా ఉండటం వల్లే.. సినిమాలో మా పాత్రలు అంత చక్కగా వచ్చాయని నేను అనుకుంటున్నాను. విజయ్ గొప్ప నటుడు. సన్నివేశాన్ని కానీ, సంభాషణలను కానీ అతను అర్థం చేసుకుని నటించే తీరు నన్ను ఆశ్చర్యపరిచింది. నాగవంశీ గట్స్ ఉన్న ప్రొడ్యూసర్. ఒక కథను నమ్మి సినిమా చేద్దాం అనుకున్నారంటే అంతే. ఆ సినిమా పూర్తయ్యే వరకు ఎక్కడా వెనకడుగు వేయరు, అసలు ఏ విషయంలోనూ రాజీపడరు. వంశీ అలా ఉన్నాడు కాబట్టే.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ రోజు ఇంత పెద్ద నిర్మాణ సంస్థగా ఎదిగింది. వంశీ అంటే నాకెప్పుడూ గౌరవం ఉంటుంది.

Also Read- Vijay Deverakonda: ‘కింగ్‌డమ్’ చూసి సుకుమార్ ఫోన్ చేశారు.. అప్పుడు సంతోషించా!

శివ పాత్రను గౌతమ్ చాలా గొప్పగా రాశారు. నేను నటించాను అని కాదు.. నిజంగానే ఆ పాత్రను గౌతమ్ చాలా బాగా రాశారు. గౌతమ్ యొక్క అంత అందమైన రచన వల్లే, సినిమాలో నా పాత్రకు ఇంత పేరు వచ్చింది. ఒక్కరిని కాదు, చాలామంది ఫోన్ చేసి నా పాత్రని, నటనని ప్రశంసించారు. ముఖ్యంగా పలువురు సినీ ప్రముఖులు ఫోన్లు చేసి నన్ను అభినందించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ‘అరేబియన్ కడలి’ అనే వెబ్ సిరీస్ చేశాను. అమెజాన్ ప్రైమ్‌లో ఆగస్ట్ 8 నుంచి స్ట్రీమింగ్‌కు వస్తుంది. ‘ఫుల్ బాటిల్’ అనే సినిమా కూడా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదలవుతుంది. ప్రస్తుతం వెంకటేష్ మహా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ‘ఆరంభం’ ఫేమ్ అజయ్‌ నాగ్‌‌తో ఓ చిత్రం చేస్తున్నాను. వీటితో పాటు మరో రెండు సినిమాలు రన్నింగ్‌లో ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?