Allu Aravind: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) చిత్రం విడుదలైన మరుసటి రోజే, అల్లు అరవింద్ ఓ యానిమేషన్ చిత్రాన్ని పోటీగా విడుదల చేసిన విషయం తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘మహావతార్ నరసింహ’ (Mahavatar Narsimha) అనే చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో అల్లు అరవింద్ తన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా గ్రాండ్‌గా విడుదల చేశారు. ‘హరి హర వీరమల్లు’ సినిమా మిశ్రమ స్పందనను రాబట్టుకోగా, ఈ ‘మహావతార్ నరసింహ’ చిత్రం పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని రికార్డులను క్రియేట్ చేస్తోంది. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీంతో మెగా, అల్లు మధ్య వార్‌కు సంబంధించి మరింతగా సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి. కావాలనే అల్లు అరవింద్ ఇలా చేశాడని మెగా ఫ్యాన్స్ భావిస్తూ.. అల్లు అరవింద్‌ని ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఈ మూవీ సక్సెస్‌ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ‘మహావతార్ నరసింహ’ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చూడాలని కోరుకుంటున్నట్లుగా అల్లు అరవింద్ ప్రకటించడం అందరినీ షాక్‌కు గురి చేసింది.
Also Read- Adah Sharma: అదా శర్మకి కూడా నేషనల్ అవార్డు వచ్చి ఉంటే బాగుండేది.. కేరళ స్టోరీ దర్శకుడు
ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ సినిమాను నేను విడుదల చేసేలా అనుగ్రహించిన నరసింహ స్వామివారికి ముందుగా నమస్కారం చేసుకుంటున్నాను. హోంబలే ఫిల్మ్స్ సంస్థతో నాకు ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. నిర్మాత విజయ్ ఫోన్ చేసి, ఈ సినిమాని తెలుగులో మీరు విడుదల చేయాలని అడిగారు. అంతే, అంతకుమించి ఒక్కమాట కూడా ఏం మాట్లాడుకోలేదు. వెంటనే ఓకే చెప్పాను. ఈ సందర్భంగా విజయ్‌కి ధన్యవాదాలు చేస్తున్నాను. సినిమా విడుదలైన రోజు మార్నింగ్ షోకి వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకుని ఈవెనింగ్‌కు కొన్ని షోస్ పెంచాం. తర్వాత రోజు నుంచి మరిన్ని స్క్రీన్స్ పెంచుకుంటూ వెళుతున్నాం. ఈ సినిమా కోసం దర్శక, నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు. 2021లో సినిమాని మొదలుపెట్టి ఎన్నోఒడిదొడుకులు ఎదుర్కొని, ఎక్కడా వెనకడుగు వేయకుండా పట్టుదలతో సినిమాని పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఆ నరసింహ స్వామి వారే వారికి ఈ అద్భుతమైన విజయాన్ని అందించారని నేను భావిస్తున్నాను. భారతదేశం అంతటా ప్రేక్షకులు ఈ సినిమాకు జేజేలు పలుకుతున్నారు.
Also Read- Aishwarya Rai: ఆరాధ్య కంటే ముందే ఐశ్వర్య రాయ్ కు బాబు పుట్టాడా.. ఆధారాలతో మొదటి బిడ్డ?
హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో 200 మంది స్వాములు ఈ సినిమాను చూడటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఎప్పుడూ థియేటర్స్‌కు రాని ప్రేక్షకులు ఈ సినిమా కోసం వస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు ఉద్వేగంతో తమ తోటివారితో సినిమా గురించి గొప్పగా చెబుతుంటే, ఇక ఈ సినిమాకు మనం ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదని అనిపించింది. ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన భరణి, జొన్నవిత్తులకు ధన్యవాదాలు. మా కుటుంబంలో, సన్నిహితులు, పరిచయం ఉన్నవారందరిలో కూడా సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. పవన్ సనాతన ధర్మం గురించి ప్రసంగిస్తే అందరం ముగ్ధులవుతాం. అందుకే ‘మహావతార్ నరసింహ’ సినిమాను ఆయన చూడాలని, ఆ సినిమా గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్‌లో భాగమైన మీడియాకు, సహకరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు.
ఇదిలా ఉంటే, కావాలనే అల్లు అరవింద్.. సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించారని కొందరు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎక్కడ ‘హరి హర వీరమల్లు’కు పోటీగా ఈ సినిమా తీసుకువచ్చారని జనాలు అనుకుంటారో అని, అల్లు అరవింద్ తెలివిగా ఇలా పవన్ కళ్యాణ్‌కు లింక్ చేస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు