SKN: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన 71వ జాతీయ అవార్డ్స్‌లో (71st National Awards) టాలీవుడ్‌కు చెందిన ‘బేబి’ (Baby Movie) సినిమా రెండు అవార్డ్స్ గెల్చుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్‌గా ‘ప్రేమిస్తున్నా’ పాటకు పీవీఎన్‌ఎస్ రోహిత్ అవార్డ్స్ గెల్చుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో ‘బేబి’ మూవీ టీమ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొని.. జాతీయ అవార్డ్స్ పొందిన సంతోషాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో లిరిక్ రైటర్ సురేష్ బనిశెట్టి మాట్లాడుతూ.. ‘బేబి’ సినిమాకు ఇప్పటి వరకు ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. నా పాటకు కూడా ఏదైనా అవార్డ్ వస్తే బాగుండేది అని అనుకుంటూ ఉండేవాడిని. అలాంటిది ఏకంగా నా పాటకు నేషనల్ అవార్డ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో ఐదు సాంగ్స్, రెండు బిట్ సాంగ్స్ రాశాను. సాయి రాజేశ్‌కు అన్ని అవార్డ్స్ వచ్చాయి. ఆస్కార్ అవార్డ్ కూడా ఆయన గెల్చుకుంటారని కోరుకుంటున్నానని అన్నారు.
Also Read- Kangana Ranaut: విదేశీయుడ్ని చూసి నేర్చుకోండి.. చాలా సిగ్గుచేటు.. నటి కంగనా!
సింగర్ పీవీఎన్ ఎస్ రోహిత్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ముందు నేను ఆశించినట్లుగా నా కెరీర్ లేదు. నాకు పాడటానికి అవకాశం వచ్చినట్టే వచ్చి.. ఆ తర్వాత వేరే సింగర్స్‌తో రీప్లేస్ అయ్యేవి. నిజంగా అనుకున్నది ఏదీ సరిగ్గా కలిసొచ్చేది కాదు. అందుకే ‘బేబి’ సినిమాలో ప్రేమిస్తున్నా పాట పాడే అవకాశం నాకు వచ్చినప్పుడు ఇది డూ ఆర్ డై మూమెంట్ అనేలా తీసుకున్నా. ఈ రోజు బెస్ట్ సింగర్‌గా నేషనల్ అవార్డ్ రావడం చాలా సంతోషంగానూ, నా కష్టానికి వచ్చిన గుర్తింపుగానూ భావిస్తున్నాను. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సాయి రాజేశ్, నిర్మాత ఎస్ కేఎన్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్‌లకు, అలాగే పాటని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలని అన్నారు. ‘బేబి’ సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ రావడం సంతోషంగా ఉందని అన్నారు ఎడిటర్ విప్లవ్.
Also Read- Balakrishna: ‘భగవంత్ కేసరి’కి జాతీయ అవార్డ్.. బాలయ్య స్పందనిదే!
చిత్ర నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. ఒకప్పుడు నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేస్తే మన తెలుగు సినిమాకు పురస్కారం అని కనీసం వినిపించేది కాదు. ఈ ఏడాది దాదాపు ఎనిమిది వరకు నేషనల్ అవార్డ్స్ టాలీవుడ్‌కు రావడం అంటే.. ఇది నిజంగా తెలుగు సినిమా గర్వించాల్సిన సందర్భమని నేను భావిస్తున్నాను. నేషనల్ అవార్డ్స్ గెల్చుకున్న తెలుగు మూవీస్, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ కంగ్రాట్స్ చెబుతూ.. అలాగే తెలుగు సినిమాలను అవార్డులకు ఎంపిక చేసిన జ్యూరీకి థ్యాంక్స్ చెబుతున్నాను. ఒక చెట్టు పెంచితే అది పండ్లు ఇవ్వడమే కాకుండా.. ఎండిపోయిన తర్వాత కూడా ఇళ్లు కట్టుకునేందుకు కలప ఇస్తుంది. అలాగే, ఒక మంచి మూవీ చేస్తే.. అది మనకు డబ్బుతో పాటు ఇలా గౌరవాన్ని కూడా ఇస్తుంది. ‘బేబి’ సినిమా మాకు డబ్బుతో పాటు ఫిలింఫేర్, సైమా, గామా వంటి ఎన్నో అవార్డులను తీసుకొచ్చింది. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ రావడంతో మరింత హ్యాపీగా ఉంది. నా మిత్రుడు సాయి రాజేశ్ ఈ సినిమాను ఎంతో నమ్మాడు. కథపై కొన్నేళ్లు కసరత్తు చేశాడు. అందుకే ప్రతి ఒక్కరినీ ఈ సినిమా ఆకట్టుకుంది. సాయి రాజేశ్ ‘కలర్ ఫొటో’ తర్వాత మళ్లీ ‘బేబి’ సినిమాకు నేషనల్ అవార్డ్ గెల్చుకున్నందుకు చాలా హ్యాపీ. ‘ప్రేమిస్తున్నా’ పాటను రోహిత్ చాలా అద్భుతంగా పాడాడు. ఈ పాట లిరికల్ సాంగ్‌ను మూడు రోజులు చిత్రీకరించాం. మనం మూవీలో ఫుల్ సాంగ్ చేసే టైమ్ అది. ఈ పాటను మన నేషనల్ క్రష్ రష్మికా మందన్న విడుదల చేశారు. అక్కడి నుంచి ‘బేబి’ సినిమా ప్రేక్షకులతో కనెక్ట్ కావడం ప్రారంభమైంది. ఈ సినిమాకు వంద ప్రీమియర్స్ వేశామంటే అందుకు మీడియా సపోర్టే కారణం. ఈ నేషనల్ అవార్డ్ మాపై మరిన్ని మంచి చిత్రాలు చేయాలనే బాధ్యత పెంచిందని భావిస్తున్నాం. ఇకపై కూడా మంచి సినిమాలు తీసి ప్రేక్షకుల మన్ననలు అందుకుంటామని మాటిస్తున్నామని అన్నారు. మరో నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. నేను కెరీర్‌లో ఎన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసినా ‘బేబి’ మూవీకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఈ చిత్రంలో నేను భాగమయ్యేందుకు కారణమైన ఎస్‌కేఎన్, సాయి రాజేశ్‌లకు థ్యాంక్స్ అని చెప్పారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు