Thay Call Him OG: పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ (They Call Him OG) సినిమా ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ స్ట్రోమ్’ విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ పాట గురించి సోషల్ మీడియా వ్యాప్తంగా హైప్ తారాస్థాయిని తాకుతుంది. ఎస్. థమన్ సంగీతంలో, తమిళ నటుడు శింబు ఈ పాటను పాడారు. ఈ పాట తెలుగు, ఇంగ్లీష్, జపనీస్ సాహిత్యంతో గ్లోబల్ ఫైర్ యాంథమ్‌గా రూపొందింది. ఈ పాటను చూసిన అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ పాట ప్రకటనతో పవన్ కళ్యాణ్ వపర్ ఫుల్ లుక్‌తో స్టైలిష్ పోస్టర్‌ను విడుదల చేసి, “రేజ్‌లో పుట్టి, ఫైట్ కోసం రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ తిరిగి వచ్చాడు” అనే క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ పాట విడుదలై సోషల్ మీడియాలో చర్చ చేస్తోంది.
Read also- Mynampally Hanumantha Rao: శంబీపూర్ రాజుతో ఎందుకీ గొడవలు?
నిర్మాతలు ఈ సినిమా గురించి ప్రేక్షకులను ఊరిస్తూ, ‘హంగ్రీ చీతా’ టీజర్‌తో సృష్టించిన హైప్‌ను మరింత పెంచుతున్నారు. ఈ పాటను “గ్లోబల్ ఫైర్ యాంథమ్”గా ప్రచారం చేస్తూ, జపనీస్ మార్షల్ ఆర్ట్స్, గ్యాంగ్‌స్టర్ ఎస్థెటిక్స్‌తో కూడిన పోస్టర్‌లతో అభిమానుల ఆసక్తిని రెట్టింపు చేశారు. థమన్ స్వయంగా ఈ పాటను “బ్లాస్ట్”గా పేర్కొన్నారు, దీనితో సోషల్ మీడియాలో #OGFirstSingleBlast, #TheyCallHimOG హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. సెప్టెంబర్ 25, 2025న విడుదలకు సిద్ధమవుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్‌లతో కలిసి పవన్ కళ్యాణ్ యాక్షన్ అవతారంతో బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టడానికి రెడీ గా ఉంది.
Read also- Satyavati Rathod: గురుకుల పాఠశాలలో దారుణం.. కారంతో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్!
‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) పవన్ కళ్యాణ్ నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా చిత్రం. ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్‌స్టర్ పాత్రలో తనదైన శైలితో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించనున్నారు. స్టైలిష్ విజువల్స్, థమన్ పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ చిత్రం అభిమానుల అంచనాలను మించనుంది. ఇమ్రాన్ హష్మీ తెలుగు సినిమాలో తొలిసారి విలన్‌గా కనిపించడం హిందీ, తెలుగు ప్రేక్షకులను ఆకర్షించనుంది. సుజిత్ స్టైలిష్ టేకింగ్‌తో ‘ఓజీ’ బ్లాక్‌బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.