Pawan Kalyan: విజేతలకు పవన్ కళ్యాణ్ అభినందనలు వచ్చేశాయ్..
Pawan Kalyan on National Awards
ఎంటర్‌టైన్‌మెంట్

Pawan Kalyan: విజేతలకు పవన్ కళ్యాణ్ అభినందనలు వచ్చేశాయ్..

Pawan Kalyan: 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం (ఆగస్ట్ 1)న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డులలో తెలుగు సినిమాలు కూడా సత్తా చాటాయి. ఒకప్పుడు ఒకటి, రెండు అవార్డులు రావడానికి గగనంగా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో టాలీవుడ్ స్థాయి అమాంతం పెరగడం, ఆస్కార్ రేంజ్ వరకు చేరుకోవడంతో.. ఇప్పుటి ప్రతి అవార్డులలో తెలుగు సినిమాకు స్థానం లభిస్తోంది. ఇక శుక్రవారం ప్రకటించిన 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో భగవంత్ కేసరి, హనుమాన్, బలగం, బేబి వంటి చిత్రాలు సత్తా చాటి, టాలీవుడ్ స్థాయిని మరోసారి తెలియజేశాయి. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాలకు ఎంపికైన ప్రతి ఒక్కరికీ ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో..

Also Read- National Film Awards: 71వ జాతీయ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

‘‘జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు
71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉంది. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకం. ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్దిలకు అభినందనలు. ఉత్తమ వి.ఎఫ్.ఎక్స్. చిత్రంగా ‘హను-మాన్’ చిత్రం నిలిచింది. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, వి.ఎఫ్.ఎక్స్. నిపుణులకు, నిర్మాతకు అభినందనలు. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నీలం సాయి రాజేష్ (బేబీ చిత్రం), ఉత్తమ గీత రచయితగా కాసర్ల శ్యామ్ (బలగం), ఉత్తమ గాయకుడుగా పి.వి.ఎన్.ఎస్.రోహిత్ (బేబీ), ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా నందు పృథ్వీ (హను-మాన్), ఉత్తమ బాల నటిగా సుకృతివేణి బండ్రెడ్డి (గాంధీ తాత చెట్టు) పురస్కారాలకు ఎంపికైనందుకు వారికి హృదయపూర్వక అభినందనలు. ఈ పురస్కారాలు చిత్ర పరిశ్రమకు నూతనోత్సాహాన్ని అందిస్తాయి. అలాగే జాతీయ ఉత్తమ నటులుగా షారుక్ ఖాన్, విక్రాంత్ మాస్సే.. ఉత్తమనటిగా రాణీ ముఖర్జీ, ఉత్తమ దర్శకుడుగా సుదీప్తో సేన్‌లతో పాటు ఇతర పురస్కార విజేతలకు అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

Also Read- Triptii Dimri: త్రిప్తి బాయ్ ఫ్రెండ్ అతనేనా.. అలా చేశాడంటే ఆయనే!

71వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల వివరాలివే..

ఉత్తమ నటుడు: షారుఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్)

ఉత్తమ నటి- రాణి ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే)

ఉత్తమ దర్శకత్వం: ది కేరళ స్టోరి

ఉత్తమ చిత్రం (తెలుగు)- భగవంత్ కేసరి

ఉత్తమ చిత్రం (తమిళం)- పార్కింగ్

ఉత్తమ చిత్రం (హిందీ)- కథల్‌: ఏ జాక్‌ ఫ్రూట్‌ మిస్టరీ

ఉత్తమ చిత్రం (పంజాబీ)- గాడ్‌డే గాడ్‌డే చా

ఉత్తమ చిత్రం (ఒడియా): పుష్కర

ఉత్తమ చిత్రం (మరాఠీ): షామ్‌చియాయ్

ఉత్తమ చిత్రం (మలయాళీ): ఉళ్ళోలుక్కు

ఉత్తమ చిత్రం (కన్నడ): కండీలు-ది రే ఆఫ్ హోప్

ఉత్తమ చిత్రం (గుజరాతీ): వష్

ఉత్తమ చిత్రం (బెంగాలీ): డీప్ ఫ్రిడ్జ్

 

బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: 12th ఫెయిల్

ఉత్తమ సహాయ నటి: ఉల్లుకు (మలయాళం) ఊర్వశి, వష్‌ (గుజరాతీ) జానకీ బోడివాలా

ఉత్తమ సహాయ నటుడు: పూక్కాలం (మలయాళం) విజయ రాఘవన్‌, పార్కింగ్‌ (తమిళ్‌) ముత్తుపెట్టాయ్‌ సోము భాస్కర్‌

ఉత్తమ బాలల చిత్రం: నాల్‌ (మరాఠీ)

ఉత్తమ సంగీత దర్శకత్వం: వాతి (తమిళ్- జీవీ ప్రకాశ్ కుమార్- సాంగ్స్), యానిమల్ (హిందీ- హర్షవర్ధన్ రామేశ్వర్- నేపథ్య సంగీతం)

బెస్ట్ మేకప్: సామ్ బహదూర్ (హిందీ – శ్రీకాంత్ దేశాయ్)

బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సామ్‌ బహదూర్‌ (హిందీ)

బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: యానిమల్‌ (హిందీ) సచిన్‌ సుధాకరన్‌, హరి హరన్‌ మురళీ ధరన్‌

ఉత్తమ సినిమాటోగ్రఫీ: ది కేరళ స్టోరి – పసంతను మొహపాత్రో

బెస్ట్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్: హనుమాన్ (తెలుగు)

యాక్షన్ డైరెక్షన్: హనుమాన్ (తెలుగు)

ఉత్తమ కొరియోగ్రఫీ: రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ (హిందీ- దిండోరా బాజే రే- వైభవి మర్చంట్)

ఉత్తమ నేపథ్య గాయని: జవాన్‌ (చెలియా- శిల్పారావు)

ఉత్తమ నేపథ్య గాయకుడు: బేబీ( ప్రేమిస్తున్నా- పీవీన్‌ ఎస్‌ రోహిత్‌)

ఉత్తమ గేయ రచయిత: కాసర్ల శ్యామ్ (బలగం- ఊరు పల్లెటూరు)

ఉత్తమ బాలనటి: బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: గాంధీతాత చెట్టు (సుకృతివేణి), జిప్సీ (మరాఠీ) కబీర్‌ ఖండారీ, నాల్‌ 2 (మరాఠీ) త్రిష థోసర్‌, శ్రీనివాస్‌ పోకలే, భార్గవ్‌ జగ్దీప్‌

ఉత్తమ సంభాషణలు: సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై (హిందీ- దీపక్‌ కింగ్రానీ)

బెస్ట్‌ప్రొడక్షన్‌ డిజైన్‌: 2018 – ఎవ్రీ వన్‌ ఈజ్‌ ఏ హీరో (మలయాళం)

బెస్ట్‌ ఎడిటింగ్‌: పూక్కాలమ్‌ (మలయాళం- మిధున్‌ మురళి)

బెస్ట్‌ స్క్రీన్‌ప్లే: బేబీ (తెలుగు – సాయి రాజేశ్‌ నీలం), పార్కింగ్ (తమిళ్- రామ్ కుమార్ బాలకృష్ణన్), సిర్ఫ్ ఏక్ బాండా కాఫీ హై (హిందీ- దీపక్ కింరానీ)

ఉత్తమ జాతీయ సమగ్రత, సామాజిక విలువల చిత్రం: సామ్‌ బహదూర్‌ (హిందీ)

ఉత్తమ ప్రజాదరణ చిత్రం: రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ (హిందీ)

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..