Chinna Jeeyar Swamy Meets Modi
తెలంగాణ

Narendra Modi: సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రానికి రావాలంటూ మోదీకి ఆహ్వానం

Narendra Modi: 11వ శతాబ్దపు ఆధ్యాత్మిక గురువు శ్రీ రామానుజాచార్యుల విగ్రహం పంచలోహాలతో తయారు చేయబడిన విషయం తెలిసిందే. శంషాబాద్ శ్రీ రామానగరం, ముచ్చింతల్ రోడ్‌లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ‌గా రూపొందిన ఈ విగ్రహాన్ని 5 ఫిబ్రవరి, 2022న వసంత పంచమి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించి, జాతికి అంకితం చేశారు. 2014లో ఈ విగ్రహా పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3 వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది చివరలో నిర్వహించే ముగింపు వేడుకలకు విశిష్ట అతిధిగా రావాలని ప్రధానమంత్రిని ఆహ్వానించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి.

ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3 వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)ని కలిశారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్‌ గ్రూప్ చైర్మన్ డా. జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ వైస్ చైర్మన్ రామురావు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో శుక్రవారం ఉదయం డాక్టర్ రామేశ్వరరావ్, రామురావుతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన చినజీయర్ స్వామి… హైదరాబాద్ ముచ్చింతల్‌లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం విశేషాలను వివరించారు. సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో ఉన్న 108 దివ్య దేశాలలో కొలువుతీరినటువంటి దేవతామూర్తులకు జరిగే నిత్య కైంకర్యాలను ప్రధాని మోదీకి తెలియజేశారు.

Also Read- Eye Care: వెచ్చని కంటి కాపడం, కాజల్ వాడకం మీ కళ్ళకి సురక్షితమేనా? కంటి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే?

దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోన్న నేత్ర విద్యాలయం, ఆయుర్వేద- హోమియో కళాశాల పురోగతి గురించి ప్రధాని మోదీ కూడా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. ఆధ్యాత్మిక, దైవిక కార్యక్రమాల ద్వారా సమాజంలో భక్తిభావాన్ని పెంపొందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలవడం గొప్ప విషయం అంటూ.. ప్రధాని మోదీ ఈ సందర్భంగా మైహోమ్‌ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావును అభినందించారు. ప్రస్తుతం ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read- Vijay Deverakonda: ‘అన్నా మనం హిట్ కొట్టినం’ అంటుంటే.. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది..

ముచ్చింతల్‌లోని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ (సమతామూర్తి) గురించి మరిన్ని వివరాలు

సమతామూర్తి: ఇది 11వ శతాబ్దపు ఆధ్యాత్మిక గురువు శ్రీ రామానుజాచార్యుల విగ్రహం.
స్థలం: శ్రీ రామానగరం, ముచ్చింతల్ రోడ్, శంషాబాద్, హైదరాబాద్.
ప్రధాన ఆకర్షణ: ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద కూర్చున్న విగ్రహం.
నిర్మాణం: ఈ విగ్రహం పంచలోహాలతో (బంగారం, వెండి, రాగి, ఇత్తడి, జింక్) తయారు చేయబడింది.
దర్శనీయ స్థలాలు: విగ్రహం బేస్‌లో రామానుజుల జీవితం, తత్వశాస్త్రం గురించి వివరించే ఒక మందిరం, వేదిక్ డిజిటల్ లైబ్రరీ, పరిశోధనా కేంద్రం ఉన్నాయ
బుధవారం ఈ కేంద్రం మూసి ఉంటుంది.
కెమెరా లేదా మొబైల్ ఫోన్లు లోపలికి అనుమతించబడవు.
రాత్రి వేళల్లో లైట్ అండ్ సౌండ్ షో ఉంటుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?