Banakacherla Water
Politics, లేటెస్ట్ న్యూస్

Banakacherla: బనకచర్ల రాజకీయం.. మళ్లీ మొదలు!

Banakacherla: ఏపీ, తెలంగాణ మధ్య చాలా పంచాయితీలు ఉన్నాయి. ఇవి చాలవన్నట్టు ఈ మధ్య కాలంలో బనకచర్ల వార్ మొదలైంది. కేంద్రం నుంచి అనుమతుల నిరాకరణ తర్వాత ఈ అంశం సద్దుమణిగింది. ఢిల్లీ మీటింగ్‌లో ఏపీ ప్రతిపాదనను తెలంగాణ తోసిపుచ్చింది. బనకచర్ల విషయంలో వెనక్కి తగ్గమని స్పష్టం చేసింది. దీంతో అప్పటి నుంచి బనకచర్ల పేరు రెండు రాష్ట్రాల్లో వినిపించడం లేదు. కానీ, ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయంగా ఈ అంశం హాట్ టాపిక్ అయింది.

లోకేష్ ఏమన్నారంటే?

సముద్రంలో కలిసే మిగులు జలాలు వాడుకుంటే తప్పేంటని లోకేష్ ప్రశ్నించారు. ఆనాడు కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు తాము అడ్డుపడలేదని, మిగులు జలాలను రాయల సీమకు తరలిస్తే ఇబ్బంది ఎందుకని నిలదీశారు. రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ లేకుండా కాళేశ్వరం కట్టలేదా అంటూ కడిగిపారేశారు. రాజకీయాల కోసం ఈ అంశం చుట్టూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దని తెలుగువారి మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు, తెలంగాణలో పెట్టుబడులను తాము అడ్డుకున్నామా, తెలుగువారి సంక్షేమం కోసమే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని అన్నారు. బనకచర్ల ప్రతిపాదించింది ఆంధ్రా భూభాగంలోనే, అక్కడో రూల్, ఇక్కడో రూల్ ఉంటుందా అని అడిగారు. బనకచర్లపై పూర్తిస్థాయి చర్చ జరగాలని తాము కోరుకుంటున్నట్టు తెలిపారు. తాము ఎవరి నీళ్లను దోచుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రతి ఏటా వందల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నదని, మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తామని లోకేష్ అన్నారు.

Read Also- KCR Meetings: భవిష్యత్తు కనపడుతోందా.. బీఆర్ఎస్‌లో టెన్షన్ టెన్షన్

అంతా మీ ఇష్టమా?

లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు రియాక్ట్ అవుతున్నారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందిస్తూ, ఎగువ ప్రాంతంలో ఉన్నామని తాము ఇష్టారాజ్యంగా చేస్తున్నామా అని అడిగారు. సీడబ్ల్యూసీ నిబంధనలకు ఏపీ కట్టుబడి ఉండాలని అన్నారు. బనకచర్ల విషయంలో తమ వైఖరి ఒక్కటేనని, చుక్క నీటిని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు కడతామని ఊరుకోమని హెచ్చరించారు. మిగులు జలాలు తెలంగాణ వాడుకున్న తర్వాత మిగిలితేనే ఏపీ వాడుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు కూడా తెలంగాణ వాటా వాడుకునేందుకే కట్టారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా కమిట్‌మెంట్‌తో ఉన్నారని, చుక్క నీటిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ, బనకచర్లకు తాము వ్యతిరేకమని అన్నారు. ఈ అంశంలో ఐక్యంగా పోరాటం చేస్తామని తెలిపారు. ఆరు నూరైనా బనకచర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ వెనక్కి తగ్గరని అన్నారు.

Read Also- Viral Video: రోబోకు సుస్సు అర్జెంట్ అనుకుంటా.. ఎలా పరిగెడుతోందో చూడండి!

Just In

01

OTT movie: వీడియో గేమ్ ఆధారంగా వచ్చిన హారర్ మూవీ.. చూస్తే తడిచిపోతారు..

CM Chandrababu: ఫ్రీ బస్సు పథకంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Festive Trains: దక్షిణమధ్య రైల్వే అదిరిపోయే గుడ్‌న్యూస్.. ప్యాసింజర్లకు ఇక పండుగే!

US Shutdown: షట్ డౌన్‌లోకి అమెరికా.. ఆగిపోయిన ప్రభుత్వ సేవలు.. 6 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైమ్

October releases: అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే.. క్యూలో స్టార్ హీరో చిత్రాలు!