Cyber Criminals Arrested( IMAGE credit: twiitewr or free pi)
తెలంగాణ

Cyber Criminals Arrested: పక్కా సెటప్‌తో సైబర్ మోసాలు.. 230 సిమ్ కార్డులు సీజ్!

 Cyber Criminals Arrested: పక్కా సెటప్ ఏర్పాటు చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఒక ముఠాలోని నలుగురిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(Telangana Cyber Security Bureau)అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 సిమ్ బాక్స్ డివైజ్‌లు, 230కి పైగా సిమ్ కార్డులు, ఓ ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ మోడెం, 4 మొబైల్ ఫోన్లు, ఒక ఇన్వర్టర్‌తోపాటు హార్డ్‌వేర్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపిన ప్రకారం ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
‘చక్షూ పోర్టల్’ ఇచ్చిన క్లూ..
ఏటేటా పెరిగిపోతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి టెలీకమ్యూనికేషన్స్ శాఖ పలు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కొంతకాలం క్రితం ‘చక్షూ పోర్టల్’ ను ప్రారంభించారు. దీని ద్వారా మొబైల్ ఫోన్ కాల్స్‌పై నిఘా పెట్టారు. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంగా వందలాది ఫోన్ కాల్స్ వెళుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు తెలియజేశారు.

 Also Read: Meenakshi Natrajan: ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. రంగాపూర్ నుంచి పాదయాత్ర షురూ!

ఈ క్రమంలో రామగుండం సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ రెడ్డి, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, లక్సెట్టిపేట సీఐ డీ.రమణమూర్తి, (CI D. Ramanamurthy)రామగుండం సైబర్ క్రైమ్ సీఐలు సీహెచ్.కృష్ణమూర్తి, ఎన్.శ్రీనివాస్, టెలీకాం శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (సెక్యూరిటీ) అలెన్ అనురాగ్, లక్సెట్టిపేట ఎస్ఐ జీ.అనూష, దండేపల్లి ఎస్ఐ మహ్మద్ తహసీనొద్దీన్ లు ప్రత్యేక బృందంగా ఏర్పడి విచారణ చేపట్టారు. జన్నారంలోని ఓ ఇంటి నుంచి సైబర్ నేరాలు జరుగుతున్నట్టు గుర్తించి దానిపై దాడి జరిపారు. ఈ క్రమంలో కామేశ్, బావు బాపయ్య, బావు మధుకర్, గొట్ల రాజేశ్వర్‌లను అరెస్ట్ చేశారు. గ్యాంగ్ లీడర్ పాలవల్సుల సాయికృష్ణ అలియాస్ జాక్, జయవర్ధన్, సింహాద్రి లు పరారీలో ఉన్నట్టు గుర్తించారు.

మోసాల సెటప్, అరెస్టులు..
ఈ కేసులో అరెస్టయిన బాపయ్యకు ప్రధాన సూత్రధారి జాక్ 2023లో చండీగఢ్‌లో పరిచయం అయినట్టుగా విచారణలో వెల్లడైంది. ఆ తరువాత 2024, జూలైలో బాపయ్య ఉద్యోగరీత్యా కాంబోడియా దేశానికి వెళ్లాడు. అదే సంవత్సరం డిసెంబర్‌లో కాంబోడియా వెళ్ళిన జాక్ అక్కడ బాపయ్యను కలిశాడు. గత ఏప్రిల్‌లో బాపయ్య స్వదేశానికి తిరిగి రాగా, జాక్ అతనితో వాట్సాప్ ద్వారా మాట్లాడి జన్నారం ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకోమని సూచించాడు. ఈ మేరకు బాపయ్య తన బావమరిది రాజేశ్ సహాయంతో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆ మరుసటి నెలలో మరోసారి వాట్సాప్ ద్వారా బాపయ్యతో మాట్లాడిన జాక్ తాను సిమ్ బాక్స్ డివైజ్‌లతోపాటు కొన్ని పరికరాలను పంపిస్తున్నానని, వాటిని కలెక్ట్ చేసుకుని అద్దెకు తీసుకున్న ఇంట్లో పెట్టాలని సూచించాడు.

ఆ సమయంలో ఊరి బయట ఉన్న బాపయ్య తన సోదరుడు మధుకర్ ద్వారా ఆ పరికరాలను తెప్పించి ఇంట్లో పెట్టాడు. అనంతరం జాక్ సూచనల మేరకు బాపయ్య, సాయికృష్ణ, మధుకర్‌లు జన్నారంలో ఎయిర్ టెల్ డీలర్‌గా ఉన్న సయ్యద్ అర్భాజ్ నుంచి ఎయిర్‌టెల్ ఫైబర్‌నెట్ కనెక్షన్ తీసుకున్నారు. ఇక, జూన్ 30న మెకానికల్ ఇంజనీర్ అయిన కామేశ్‌ను టెలిగ్రాం యాప్ ద్వారా కాంటాక్ట్‌లోకి తీసుకున్న జాక్, తాను చెప్పినట్టుగా చేస్తే నెలకు రూ. 70 వేల జీతం ఇస్తానని చెప్పాడు. ఈ క్రమంలో జాక్ సూచనల మేరకు జన్నారం వచ్చిన కామేశ్ ఇక్కడ బాపయ్య, మధుకర్‌లను కలిశాడు. అనంతరం ముగ్గురూ కలిసి సైబర్ నేరాలు(Cyber crimes) చేయడానికి అప్పటికే తెప్పించుకున్న పరికరాలతో పక్కాగా సెటప్ సిద్ధం చేశారు. దీని కోసం మధుకర్ ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా ఒకసారి 90, రెండోసారి 60 సిమ్ కార్డులను సమకూర్చాడు. ఆ తరువాత కామేశ్ తనకు పరిచయం ఉన్న సింహాద్రి నుంచి ఇలాగే మరో 200 సిమ్ కార్డులు తెప్పించాడు. దీని కోసం జాక్ రూ. 3 లక్షల రూపాయలను సమకూర్చాడు.

మోసాల తీరు..
ఇలా పూర్తి సెటప్ ఏర్పాటు చేసుకున్న తరువాత నిందితులు రాండమ్ గా వేర్వేరు మొబైల్ ఫోన్ల(Mobile phones)కు కాల్స్ చేయడం మొదలుపెట్టారు. తమను తాము సీబీఐ, సెంట్రల్ కస్టమ్స్, ఈడీ అధికారులుగా చెప్పుకుంటూ “మీపై కేసులు నమోదయ్యాయి” అని పలువురిని బెదిరించి డబ్బులు కొల్లగొడుతూ వచ్చారు. దాంతోపాటు ఫైనాన్షియల్ మోసాలు కూడా చేస్తూ వస్తున్నారు. కొన్ని రోజులపాటు ఆపరేషన్ నిర్వహించి, ఈ గ్యాంగ్ సాగిస్తున్న నేరాల గురించి పక్కాగా సమాచారాన్ని సేకరించిన ప్రత్యేక బృందం నలుగురిని అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్న జాక్, జయవర్ధన్, సింహాద్రిల కోసం గాలిస్తుంది.

 Also Read: Saiyaara Movie: బాక్సాఫీస్ దూకుడు.. కేవలం 12 రోజుల్లోనే ‘ఛావా’ను బీట్ చేసిన ‘సయారా’!

Just In

01

Hyderabad SHE Teams: గణేష్ ఉత్సవాలు.. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన.. 1612 మంది పోకిరీల అరెస్ట్

Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్లపై గుడ్ న్యూస్.. ఒక్క ఫోన్‌తో మీ సమస్యలకు చెక్!

Tunnel movie: డేట్ మారిన లావణ్య త్రిపాఠి ‘టన్నెల్’.. వచ్చేది ఎప్పుడంటే?

Kaantha: ‘కాంత’ విడుదల వాయిదా.. టీమ్ ఏం చెప్పిందంటే?

Nano Banana: గూగుల్ జెమినీలో 3డీ ఇమేజెస్‌ ఆప్షన్.. క్రియేట్ చేయడం చాలా ఈజీ!