pavan-kalyan og( image source :x)
ఎంటర్‌టైన్మెంట్

Pawan Kalyan OG: ‘ఓజీ’ నుంచి ఫస్ట్ అప్డేట్.. ‘ఫైర్ స్టోమ్’ ఆన్ ది వే..

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ (OG) సినిమా నుంచి వచ్చిన తాజా అప్‌డేట్ పవన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ‘యుద్ధం కోసం సృష్టించబడ్డాడు, అంతిమ అధ్యాయాన్ని రచించడానికి వచ్చాడు.’ అనే ట్యాగ్‌లైన్‌తో నిర్మాతలు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ స్టైలిష్ పోస్టర్ సినిమా హైప్‌ను మరింత పెంచింది. ఈ పోస్టర్‌ ను చూస్తే పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా ఉంటుందని తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఈ సినిమాను ‘ఫైర్‌ స్టోమ్’ గా అభివర్ణిస్తున్నారు. ఈ సినిమాతో 12 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రీ-ఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లు, బ్లాక్‌బస్టర్ పాటలు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో మొదటి సగం గూస్‌బంప్స్ తెప్పించే సన్నివేశాలు ఉన్నాయని సమాచారం.

Read also- Vijay Deverakonda: ‘అన్నా మనం హిట్ కొట్టినం’ అంటుంటే.. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది..

ఈ సినిమా నుంచి ఆగస్ట్ 2 న పాట విడుదల కానుంది. దీంతో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. విడుదలయ్యేది ఖచ్చితంగా ‘ఓజీ’ టైటిల్ సాంగ్ అయి ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మామోలుగానే ధమన్ సంగీతానికి థియేటర్లలో బాక్సులు బద్దలవుతాయి. అయితే ఈ సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సంగీతం అందించానని థమన్ చాలా సందర్భాల్లో చెప్పారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనిలో ఉంది. సెప్టెంబర్ 25, 2025న ప్రపంచ వ్యా్ప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Read also- Sai Durgha Tej: ‘మయసభ’ అద్భుతాలు సృష్టించాలి.. ట్రైలర్ ఎలా ఉందంటే?

సోషల్ మీడియాలో అభిమానులు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 2న ఇచ్చే అప్‌డేట్‌లో ట్రైలర్  గురించి కూడా ఏమైనా చెబితే..  అది సినిమా కథ, పాత్రలు, యాక్షన్ సీక్వెన్స్‌ల గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తుందని భావిస్తున్నారు. అయితే మరిన్ని వివరాల కోసం ఆగస్ట్ 2 అప్‌డేట్ కోసం ఎదురుచూడాలి. అప్పటి వరకు, ఓజీ ట్రైలర్ గురించి అధికారిక సమాచారం లేదు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం బాధ్యతల కారణంగా చిత్రీకరణలో జాప్యం జరిగినప్పటికీ, షూటింగ్ పూర్తి చేశారు. ‘హరి హర వీరమల్లు’ తర్వాత రాబోతున్న సినిమా కాబట్టి అభిమానులు బారీ అంచనాలు పెట్టుకున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Thummala Nageswara Rao: మంత్రి హెచ్చరించినా.. మారని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఉద్యోగుల తీరు!

GHMC: ముగిసిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

Minister Sridhar Babu: గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు

High Court: టీజీపీఎస్సీ హైకోర్టులో భారీ ఊరట.. నియామకాలు చేపట్టవచ్చని డివిజన్​ బెంచ్​!

GHMC: జీహెచ్ఎంసీ మూడు కీలక శాఖ అధికారులకు స్థానచలనం.. ఉత్తర్వులు జారీ!