Gadwal Collector
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Gadwal: గురుకుల హాస్టల్ సిబ్బందిపై వేటు

Gadwal: విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు మౌలిక వసతుల కొరతపై రోడ్డెక్కి ఆందోళనకు దిగిన నేపథ్యంలో, కలెక్టర్ పాఠశాల‌ను సందర్శించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను విని, పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేందుకు అధికారులను ఆదేశించారు.

ఇద్దరిపై వేటు.. వారికి మెమో

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను చట్టబద్ధంగా సంబంధిత అధికారులకు తెలియజేయాలని, మీ భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని కలెక్టర్ అన్నారు. రోడ్డెక్కే ప్రయత్నాలు ప్రమాదాలకు దారితీయొచ్చని ఎట్టి అలా జరగకూడదని చెప్పారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ వార్డెన్ రజిత, సూపర్వైజర్ నవీన్‌లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్‌, వార్డెన్‌, హౌస్‌ మాస్టర్‌లకు మెమో జారీ చేసినట్లు చెప్పారు. విద్యార్థులను బెదిరిస్తున్న పాఠశాల భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న నాలుగు మరుగు దొడ్లను ఉపయోగించుకోవాలని, నెల రోజుల్లో అందరికీ సరిపడేలా కొత్త మరుగు దొడ్లు నిర్మించి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

Read Also- Chetebadi: అమావాస్య రోజు మట్టిలో బతికున్న నల్లకోడిని పెట్టి.. రియల్ ఇన్సిడెంట్స్‌తో ‘చేతబడి’!

విద్యార్థులకు పౌష్టికాహారం

విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం న్యాయమైన పౌష్టికాహారం తప్పనిసరిగా అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నాణ్యతలేని బియ్యాన్ని వెంటనే తిరిగి పంపి మంచి బియ్యాన్ని తెప్పించుకోవాలని, దీనిలో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ పని చేయడం లేనందున తాగడానికి వెంటనే మినరల్ వాటర్ అందించాలని చెప్పారు. విద్యార్థుల పట్ల నిత్యం బాధ్యతతో ఉండాల్సిన ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, విద్యార్థుల ఆరోగ్యం, విద్య, భద్రత విషయంలో పూర్తి నిఘా పెట్టాలని తేల్చి చెప్పారు.

ఆకస్మిక తనిఖీ

అనంతరం ఉండవల్లి మండలం కలుగొట్ల గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల ఒక విద్యార్థినికి పాము కాటుతో అనుమానంతో ఆసుపత్రికి తరలించిన ఘటనపై స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యత గల అంశం కావడంతో, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచి, పాములు, హానికర కీటకాలు దూరంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం ప్రతిరోజూ అందించాలని ఆదేశించారు. పాఠశాల రిజిస్టర్లను తనిఖీ చేసి ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతం పూర్తిగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ అనీల, ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, కేజీవీవీ ప్రిన్సిపాల్ పరిమళ, సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్, వార్డెన్ రేణుక, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Read Also- Gujarat Crime: ఈ కంత్రి బామ్మ నేర చరిత్ర తెలిస్తే.. ఫ్యూజులు ఎగరడం పక్కా!

Just In

01

BC Reservations: బీసీ రిజర్వేషన్లు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు.. కొట్టి పారేసిన ధర్మాసనం

Telangana BJP: కొత్త నేతలతో టీమ్ వర్క్‌కు బీజేపీ ప్లాన్.. సమన్వయం కుదిరేనా..!

TGSRTC: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై ఆర్టీసీ ఏఐ వినియోగం.. ఎందుకో తెలుసా?

Thummala Nageswara Rao: మంత్రి హెచ్చరించినా.. మారని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఉద్యోగుల తీరు!

GHMC: ముగిసిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ భేటీ.. కీలక అంశాలపై చర్చ!