Kavitha Deksha
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

BC Communities: కవిత వెంటే మేము.. బీసీ బిల్లు కోసం పోరాటం

BC Communities: బీసీ బిల్లు కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టే నిరాహార దీక్షను జయప్రదం చేయాలని బీసీ సంఘాలు గోడ పత్రికను ఆవిష్కరించాయి. హైదరాబాద్‌లో జెండా ఊపి కవిత ప్రారంభించిన రథయాత్రలో పాల్గొనేందుకు మెదక్ జిల్లా కేంద్రంలోని ఐబీ గెస్ట్ హౌస్‌లో 72 గంటల నిరాహార దీక్ష చేస్తున్నట్టు తెలిపాయి. ఈ మేరకు దీక్షను జయప్రదం చేయాలని మెదక్ జిల్లా నాయకుడు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు.

నిరాహార దీక్ష 

ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్ర నాయకుడు పడిగే ప్రశాంత్ ముదిరాజ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా 72 గంటలు చేసే నిరాహార దీక్షను జయప్రదం చేయాలన్నారు. ఇందిరా పార్క్ వేదికగా బీసీలను చైతన్యం చేసి మేధావులను బీసీ సంఘం నాయకులను అందరినీ కలుపుకొని, బీసీ బిడ్డలందరూ ఆలోచన చేయాలని పిలుపునిచ్చినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ వేదికగా నిరసన కార్యక్రమం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రులు చెప్తున్నారని, అందరూ కదలి రావాలని అంటున్నారు కానీ రాష్ట్రంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి ప్రభుత్వం తరఫున అందరికీ ఆహ్వానాన్ని పంపి కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

Read Also- Khushboo Patani: స్వామీజీపై బాలీవుడ్ బ్యూటీ సోదరి విమర్శలు.. ఏం జరిగిందంటే?

ఆలస్యం ఎందుకు?

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్‌ పేరు చెప్పుకుంటూ రోజులు గడుపుతున్నది కానీ ఇప్పటివరకు స్పష్టత లేదని ప్రశాంత్ ముదిరాజ్ అన్నారు. బీసీ బిడ్డలను ఓట్లకు మాత్రమే వాడుకుంటున్నారని విమర్శించారు. రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్‌లో బీసీ బిడ్డలు తగిన గుణపాఠం చెబుతారని పడిగే ప్రశాంత్ ముదిరాజ్ హెచ్చరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 72 గంటల నిరాహార దీక్షకు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, మల్లేశం, రాజు, రామకృష్ణ, మహేష్, మహిపాల్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Read Also- Chetebadi: అమావాస్య రోజు మట్టిలో బతికున్న నల్లకోడిని పెట్టి.. రియల్ ఇన్సిడెంట్స్‌తో ‘చేతబడి’!

Just In

01

Gold Rate Today: వరుసగా రెండో రోజు తగ్గిన గోల్డ్ రేట్స్?

FSD Officer Controversy: మెడికల్ కార్పొరేషన్‌లో పెత్తనం అంతా ఆయనదే?.. చక్రం తిప్పుతున్న ఎఫ్​ఎస్‌డీ ఆఫీసర్

OG Review In Telugu: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ జెన్యూన్ రివ్యూ.. సినిమా హిట్టా? ఫట్టా?

OG Movie: ఓజీ లో ఆ హీరోయిన్ కి ఘోర అవమానం .. ఆమెను ఎడిటింగ్ లో తీసేశారా?

KTR: జీఎస్టీ పేరుతో రూ.15లక్షల కోట్లు దోచుకున్న కేంద్రం: కేటీఆర్