CPO( Image Credit: twitter)
తెలంగాణ

CPO: పదవీ కాలం పూర్తైనా కుర్చీ వదలని అధికారిణి

CPO: వైద్యారోగ్యశాఖలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో సీపీవో( చీఫ్​ ప్రోగ్రామ్ ఆఫీసర్) చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె పదవీ విరమణ పూర్తైనా, ఇంకా ఆఫీస్‌ను వదల్లేదు. జాయింట్ డైరెక్టర్‌గా రిటైర్మెంట్ తీసుకొని సుమారు ఏడాది కావొస్తున్నది. కానీ, ఇంకా ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో తిష్ట వేశారు. సీహెచ్ ఎఫ్​ డబ్ల్యూలో (కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్) ఆఫీస్‌లో ఏకంగా చీఫ్​ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అదే ఆఫీస్‌లో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేయడంతో సీపీవో పోస్టు సులువుగా వచ్చేలా ప్లాన్ చేశారు.

అధికారులతో తనకున్న పరిచయాలు ఆమెను ఆ పోస్టులో కూర్చునేందుకు సహకరించాయనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి చాలా మంది అధికారులు, డాక్టర్లు సీపీవో పోస్టు కూడా ప్రయత్నించారు. తమకు అర్హత ఉన్నదంటూ గతంలోనే గవర్నమెంట్‌కు రిక్వెస్ట్ చేశారు. కానీ, వాళ్లందరినీ పక్కకు పెట్టి పదవీ విరమణ పొందిన అధికారిణి మళ్లీ తీసుకువచ్చి కీలక పోస్టులో కుర్చోపెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. రిటైర్మెంట్ తీసుకున్న అధికారిణికి అంత ప్రయారిటీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆమె వెనక ఎవరున్నారు? సీపీవో పోస్టుకు అర్హులు లేరా? ఆరోగ్యశాఖ కుటుంబ సంక్షేమ శాఖలో పదవీ విరమణ పొందిన అధికారిణి లేకపోతే కార్యక్రమాలకు బ్రేక్‌లు పడతాయా? అనే ప్రశ్నలపై సాక్షాత్తు అదే ఆఫీస్‌లోని ఉద్యోగుల మధ్య చర్చ జరుగుతున్నది.

Also Read: Bhadrachalam: పుణ్యక్షేత్రంలో పాడు పనులు.. నిద్రపోతున్న నిఘా వ్యవస్థ

బాస్‌గా పెత్తనం?
గతంలో జేడీ(జాయింట్ డైరెక్టర్)గా పనిచేసిన అధికారిణి, ఇప్పుడు సీపీవో‌గా వర్క్ చేస్తూ అన్ని విభాగాల్లోనూ ఇన్వాల్వ్ అవుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో అంతా తానే బాస్ అన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పైగా ఆమె లేకుంటే ఆరోగ్యశాఖ కుటుంబ సంక్షేమ శాఖలో ప్రోగ్రామ్స్ అన్ని సమర్ధవంతంగా నిర్వహించలేరని ఆమె సన్నిహిత అధికారులు ఉద్యోగులకు వివరించడం గమనార్హం. సీహెచ్ ఎఫ్​ డబ్ల్యూలో సుమారు 20కి పైగా ప్రోగ్రామ్‌లు జరుగుతుంటాయి.

ఇందులో కొన్ని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ పరిధిలోనూ భాగస్వామ్యం ఉన్నాయి. అయితే, ఆ ప్రోగ్రామ్‌ల నిర్వహణలో తాను చెప్పిందే చేయాలంటూ కింది స్థాయి అధికారులకు హుకుం జారీ చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ నిబంధనలు ఎలా ఉన్నా.. తానే చెప్పిందే వేదం అనే స్థాయిలో ఆర్టర్స్ ఇస్తున్నట్లు తెలిసింది. ఇది ఉద్యోగుల వర్కింగ్ వాతావరణానికి ఇబ్బంది కరంగా మారిందనే ప్రచారం జరుగుతుంది. తనపై ఉన్న వర్క్ ప్రెజర్‌ను కింది స్థాయి ఉద్యోగులపై రుద్దుతుంటారని చెబుతున్నారు. అంతేగాక ఆఫీస్‌లో బిగ్గరగా అరుస్తూ హడావుడి చేస్తుంటారని స్వయంగా ఉద్యోగులే చెబుతున్నారు.

ప్రభుత్వ ఆదేశాలు పక్కకు?
రిటైర్మెంట్ పొందిన అధికారులను మళ్లీ విధుల్లోకి తీసుకోవద్దని, అలాంటి వారు ఉంటే వెంటనే రిలీవ్ చేయాలని గతంలోనే హెల్త్ సెక్రెటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఆదేశాలిచ్చారు. కానీ, ఆదేశాలను పక్కకు పెట్టి మరీ ఆమెను సీపీవోగా కంటిన్యూ చేయడం గమనార్హం. హెల్త్ సెక్రెటరీ సర్క్యూలర్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఇద్దరు, ముగ్గురు అధికారులను తొలగించారు. కానీ, సీపీవోను మాత్రం రిలీవ్ చేయలేదు. దీంతో ఆమెకు ప్రభుత్వ పెద్దలు అండ ఉన్నదనే ప్రచారం డిపార్ట్‌మెంట్‌లో జరుగుతుంది. దీంతో ఉన్నతాధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితులలోకి నెట్టివేయబడుతున్నారు. స్వయంగా హెల్త్ సెక్రెటరీ ఇచ్చిన ఉత్తర్వులు సీపీవోకు వర్తించవా? అంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు. పైగా గతంలో సరోగసీ కేంద్రాల పర్మిషన్లు, మానిటరింగ్ బాధ్యతలు ఈమె చూసినట్లు తెలుస్తున్నది.

జీతంలో కలిపి మూడు లక్షలు?
ప్రస్తుత సీపీవోగా ఉన్న అధికారిణికి రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం నుంచి సుమారు లక్షన్నర వరకు ఫించన్ వస్తుండగా, సీపీవో పోస్టుకు నెలకు దాదాపు మరో లక్షన్నర జీతం ఇస్తున్నారు. దీంతో పాటు ప్రత్యేక కారు, అలవెన్స్‌లు వంటివి ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఇదే లక్షన్నర జీతానికి చాలా మంది రెగ్యులర్ అధికారులు, డాక్టర్లు పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నా.. వాళ్లకు ఆ పోస్టు ఇవ్వట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఇన్‌ప్లూయెన్స్ ఏ స్థాయిలో ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతున్నది.

 Also Read: Telangana Police Duty Meet 2025: పోలీస్ డ్యూటీ మీట్‌కు సర్వం సిద్ధం: సీపీ సన్ ప్రీత్ సింగ్

Just In

01

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు