kingdom( image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Kingdom: సాంగ్ మధ్యలో ఉన్న పవన్ కళ్యాణ్‌ను కలిసిన ‘కింగ్డమ్’ టీం

Kingdom: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ సినిమా జూలై 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. విడుదలకు కొన్ని గంటల ముందే సినిమా టీం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలవడం హైలైట్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుంతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో బీజీ బీజీగా ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమాకు సంబంధించి పాట షూట్ జరుగుతోంది. అదే సమయంలో విజయ్ దేవరకొండ, నిర్మాత నాగవంశీ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పవన్ కళ్యాణ్ ను కలిశారు. సాంగ్ షూట్ లో ఉన్న పవన్ అదే కాస్ట్యూమ్ తో ఫోటోకు ఫోజు ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ లుక్ చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. వింటేజ్ లుక్‌లో పవన్ అదిరిపోయాడని, సూటు పర్పెక్ట్ గా సూటయిందని కామెంట్లు పెడుతున్నారు. పక్కనే పవన్ హీరోయిన్ శ్రీలీల కూడా ఉన్నారు. ఈ దెబ్బతో కింగ్డమ్ సినిమాకు భారీ ప్రమోషనే అయిందంటున్నారు అభిమానులు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ లుక్ రివీల్ అవ్వడంపై తెగ సంబరపడుతున్నారు అభిమానులు.

Read also- NIMS: ‘నిమ్స్​’పై నిఘా!.. ఏం జరగబోతోంది?

‘కింగ్డమ్’ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మరికొన్ని గంటల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్ దేవరకొండ నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన చిత్రం తెలుగు, తమిళం, హిందీలో భాషల్లో విడుదలవుతోంది. శ్రీలంకలో గ్యాంగ్‌స్టర్ అండర్‌వరల్డ్‌లోకి చొరబడే పోలీసు అధికారి కథతో, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ నటించగా, అనిరుధ్ సంగీతం అందించారు. ఇటీవల సందీప్ రెడ్డి వంగాతో జరిగిన ఓ పాడ్ కాస్ట్ లో ఈ చిత్రం ద్వారా తన అభిమానులకు ఒక గొప్ప అనుభవాన్ని అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పాడు. విజయ్ దేవరకొండ ఈ చిత్రం కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

Read also- Coolie: ‘కూలీ’ పవర్‌హౌస్ సాంగ్ తెలుగులో వచ్చేసింది.. టాక్ ఏంటంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతోంది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దేశభక్తుడైన ఓ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ గెటప్‌లో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీకి అయానక బోస్, ఎడిటింగ్‌కి ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు. దేశభక్తి, డైలాగ్ పంచ్‌లు, మాస్ ఎలిమెంట్స్‌ మేళవించిన ఈ సినిమా పవన్ ఫ్యాన్స్‌కి పండగలా ఉండనుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. మరో హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా తమిళ సినమా ‘తెరి’ రిమేక్ అనుకున్నా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టుడా మార్పులు చేశారని సమాచారం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?