Anasuya
ఎంటర్‌టైన్మెంట్

Anasuya: తల్లి అయినంత మాత్రాన మన నిజమైన వ్యక్తిత్వాన్ని వదులుకోవాలా?.. అనసూయ పోస్ట్ వైరల్!

Anasuya: ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూ, సోషల్ మీడియాలో హైలైట్ అవుతూ ఉంటే అనసూయ.. మరోసారి సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు, అనసూయకు అస్సలు పడదు. ఆంటీ అంటూ అనసూయని ఆటపట్టిస్తూ.. ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా ‘కింగ్‌డమ్’ విడుదలకు సిద్ధమైన వేళ మరోసారి అనసూయ పేరును టార్గెట్ చేస్తూ కొందరు అనుచిత వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అలా పోస్ట్ చేసే వారందరిని ఉద్దేశించి తాజాగా అనసూయ ఓ లేఖను విడుదల చేసింది. ఈ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ లేఖలో..

‘‘నేను ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాను. ఇతరులు నా గురించి మాట్లాడే సమయంలో నేను మౌనంగా ఉంటాను. కానీ, నా లైఫ్‌ని నేను లీడ్ చేస్తున్నందుకు విమర్శలు ఎదురైనప్పుడు మాత్రం.. నేను కోపంతో కాకుండా.. స్పష్టంగా వారు చేస్తుంది తప్పని చెప్పాలని అనిపిస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో కొందరు మహిళా వక్తలు నన్ను టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. వారితో నాకు, నాతో వారికి అసలు పరిచయం లేదు. అయినా వారు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు.

Also Read- Sir Madam: అప్పుడు సైలెన్స్, ఇప్పుడు వైలెన్స్.. సందడి సందడిగా ‘సార్ మేడమ్’!

నిజమే.. నేను ఒక మహిళను, భార్యను, ఇద్దరు పిల్లలకు తల్లిని. నాకు నచ్చిన విధంగా దుస్తులు ధరించడం నాకిష్టం. గ్లామర్, స్టైల్, ఆత్మవిశ్వాసం ఎప్పుడూ నా గుర్తింపులో అంతర్భాగం. కొందరు ఇది తల్లిగా ఉండటానికి సరిపోదని అనుకుంటున్నారు. వారందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. తల్లి అయినంత మాత్రాన మనం మన నిజమైన వ్యక్తిత్వాన్ని వదులుకోవాలా? అయినా నా కుటుంబం – నా భర్త, పిల్లలు – నేను ఎలా ఉన్నానో అలానే నన్ను ఇష్టపడతారు. వారు నా తీరుపై తీర్పు చెప్పరు, ఎప్పుడూ నాకు మద్దతు ఇస్తారు. నాకు కావాల్సింది అదే. కొందరు నా స్థాయి స్వేచ్ఛకు అలవాటు పడకపోవచ్చు, అది పూర్తిగా సరేనదే. నా తీరు వారికి ఏమైనా ఇబ్బందిని కలిగిస్తే అది నా తప్పు కాదు. ఆత్మవిశ్వాసం, దయ, గౌరవం, తన గురించి సిగ్గుపడని ఒక మహిళను నా పిల్లలు చూస్తూ పెరుగుతున్నారు. ధైర్యంగా ఉండటం అంటే అగౌరవంగా ఉండటం కాదు. నాకు నచ్చిన విధంగా దుస్తులు ధరించడం అంటే నేను నా విలువలను కోల్పోయానని అస్సలు అనుకోవద్దు.

Also Read- Sithara Entertainments: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 36వ చిత్రంలో హీరో ఎవరంటే?

నాలానే ఉండమని, నన్ను అనుసరించమని నేను ఎవరినీ అడగడం లేదు. అలాగే, జీవించడానికి ఇదే ఏకైక మార్గం అని కూడా నేను ఎవరికీ చెప్పడం లేదు. మీరు మీ మార్గంలో జీవించాలనుకుంటున్నట్లే, నాకు నా మార్గంలో జీవించే స్వేచ్ఛ కావాలి. ఈ లేఖ చూస్తున్న యువకులందరికీ చెబుతున్నాను.. నేను మీ అభిప్రాయాలపై జడ్జిమెంట్ చెప్పడం లేదు. అలాగే, మీరు కూడా ఇతరుల జీవనశైలి పట్ల కూడా అదే మర్యాద చూపాలని ఆశిస్తున్నాను. మనం మన మార్పులపై దాడులకు పాల్పడకుండా అంగీకరించడం నేర్చుకుంటే, మనమందరం శాంతియుతంగా కలిసి జీవించగలం. నేను ఎల్లప్పుడూ ఇతరుల పట్ల గౌరవాన్ని పాటిస్తూనే.. గర్వంగా, ప్రేమగా, హాయిగా జీవిస్తాను’’ అని పేర్కొంది.

దీనికి ఓ నెటిజన్.. ‘మేడమ్ మీరు కొండన్న (విజయ్ దేవరకొండ) సినిమా వస్తే చాలు.. ఏదొక పోస్ట్ పెడతారు. పబ్లిసిటీ మొత్తం అతనికి పోతుంది’ అని కామెంట్ చేయగా.. ఈ కామెంట్‌కు బదులిస్తూ.. ‘సార్.. అసలు లేని పోని లింక్స్ అంటగట్టొద్దండీ ప్లీజ్.. నేను అడ్రస్ చేస్తున్న విషయం మొత్తం వేరు. నాకంటూ ఒక లైఫ్ ఉంది కదా.. ఎవరి ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయో, లేవో ట్రాక్ చేసే టైమ్, ఓపిక నిజంగా నాకు లేవండి. ప్లీజ్ ఉన్నది ఉన్నట్టు తీసుకోండి’’ అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు