Nagarjuna Sagar (imagecredit:twitter)
తెలంగాణ

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ తెలంగాణకు అప్పగిస్తూ కేఆర్‌ఎంబీ ఉత్తర్వులు

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టు(Nagarjunasagar Project) తెలంగాణ(Telangana) పర్యవేక్షణలోకి వచ్చింది. ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా తెలంగాణ చేతికి అప్పగిస్తూ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(KRMB) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో డ్యామ్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్ (నిర్వహణ) కోసమే ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ వరద సీజన్ మొత్తం ప్రాజెక్టు బాధ్యతలను చూసేలా తెలంగాణ(Telangana)కు అనుమతులు ఇచ్చింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికారులు సాగర్ డ్యామ్ నిర్వహణను పర్యవేక్షించనున్నారు. సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ వరదలు వస్తుండటంతో ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తారు.

డ్యామ్‌పైకి అధికారులను అనుమతి
ఈ నేపథ్యంలో స్పిల్‌వే గేట్లతో పాటు అక్కడ మెకానికల్ వ్యవహారాలను తెలంగాణ(Telangana) చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రాజెక్టు ఆపరేషన్స్‌కు డ్యామ్‌పైకి అధికారులను అనుమతించాలంటూ ఈ నెల 17వ తేదీనే కృష్ణా బోర్డు(Krishna Board)కు ఈఎన్‌సీ జనరల్ అంజద్ హుస్సేన్(Anjad Hussain) లేఖ రాశారు. స్పిల్‌వే గేట్ల నిర్వహణను చూడాల్సి ఉండడం, సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటించాల్సి ఉండడంతో తమ అధికారులను నిత్యం డ్యామ్‌పైకి అనుమతించాలని ఆ లేఖలో ఈఎన్‌సీ(ENC) కోరారు. అందుకు అనుగుణంగా డ్యామ్ వద్ద విధులు నిర్వహించే అధికారుల జాబితాను పంపారు.

Also Read; CM Revanth Reddy: సీఎం సంతకం తర్వాత.. అన్ని కేటగిరీల వారికి పదోన్నతులు

ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ వైపు
వర్షాకాలం కావడంతో అధికారులు షిఫ్టుల వారీగా రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, అందుకు డ్యామ్‌పైకి వెళ్లాల్సి ఉంటుందని బోర్డుకు ఈఎన్‌సీ(ENC) వివరించారు. కొందరు ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్(AP) వైపు నివసిస్తున్నారని, హిల్ కాలనీలోని ఆఫీసుకు రావాలంటే చుట్టూ తిరిగి రావాల్సి వస్తుందని, దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ క్రమంలో విధులకు ఆటంకం కలగకుండా, డ్యామ్ మెయింటెనెన్స్‌ను సమర్థంగా నిర్వహించడానికి అధికారులను డ్యామ్‌పై నుంచి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు కృష్ణా బోర్డు(Krshna Board) ఆమోదం తెలిపింది.

Also Read: Vikarabad district: అభివృద్ధి ప్రజా సంక్షేమమే పార్టీ ధ్యేయం: బట్టి విక్రమార్క

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు