BRS Party Leaders ( image Credit: twitter)
Politics

BRS Party Leaders: గ్రామస్థాయి బీఆర్ఎస్‌లో గ్రూపులు.. ఎమ్మెల్యేలు మాజీల అనుచరులదే పెత్తనం!

BRS Party Leaders: స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్(BRS) సన్నద్ధమవుతోంది. గ్రామస్థాయిలో నేతలంతా పోటీచేసే అభ్యర్ధిపై ఏకాభిప్రాయానికి రావాలని పార్టీ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటివరకు గ్రామస్థాయిలో నేతల మధ్య ఉన్న అగాథాన్ని పూడ్చేందుకు పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేపట్టలేదు. కనీసం పార్టీ నేతల అభిప్రాయాలు కూడా తీసుకోలేదు. ఈ తరుణంలో స్థానిక సంస్థల్లో పోటీచేసే అభ్యర్థితో ఇరువురు ఎలా కలిసి పనిచేస్తారు? అనేది పార్టీ క్యాడర్‌లోనే చర్చకు దారితీసింది. కనీసం మండల ముఖ్య కార్యకర్తల సమావేశాల్లోనూ అభిప్రాయాలు తీసుకోవడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల అనుచరులే పెత్తనం చెలాయిస్తుండటంతో మొదట్నుంచీ పార్టీలో పనిచేసేవారు జీర్ణించుకోలేకపోతున్నారు.

 Also Read: Rajinikanth: ఆ హీరోయిన్ హగ్ ఇవ్వలేదని సెట్ నుంచి వెళ్ళిపోయిన రజినీకాంత్?

సమస్య చెబుదామంటే..
బీఆర్ఎస్‌(BRS) కు స్థానిక ఎన్నికలు కీలకంగా మారాయి. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలంటే ఎన్నికల్లో గెలవాల్సిన అనివార్య పరిస్థితి నెలకొన్నది. ఈ గెలుపుతో పార్టీ క్యాడర్‌లో నూతనోత్తేజం తీసుకొస్తేనే భవిష్యత్‌లో పార్టీకి మనుగడని అధిష్టానం సైతం భావిస్తున్నది. ఇందులో భాగంగానే మండలాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నది. కానీ, గ్రామస్థాయిలో ఉండే నేతలు, ద్వితీయ శ్రేణి నాయకుల అభిప్రాయాలను మాత్రం తీసుకోవట్లేదని పలువురు బహిరంగంగానే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బీఆర్ఎస్(BRS) అధికారంలో ఉన్నప్పుడు మొదట్నుంచీ పనిచేస్తున్నవారిని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలు పరిగణలోకి తీసుకోకుండా ఇతర పార్టీల నుంచి చేరినవారికి పెద్దపీట వేశారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న ఉద్యమకారులకు, పార్టీ కోసం పనిచేసేవారికి ప్రాధాన్యత ఇవ్వలేదని ద్వితీయ శ్రేణి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సమస్య చెప్పుకుందామని వెళ్లినా టైం ఇవ్వలేదని ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయి 19నెలలు అవుతున్నా ఇప్పటివరకు గ్రామస్థాయిలో పార్టీ సమావేశాలు నిర్వహించి కేడర్ అభిప్రాయాలు తీసుకున్న సందర్భాలు లేవు. ఇలాంటి సందర్భాలతో పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఆ గ్రూపులో కొంప ముంచుతాయా?
గ్రామాల్లో మరోవైపు గ్రూపులు కొనసాగుతున్నాయి. గతంలో ఇదే గ్రూపులపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్ సైతం చేశారు. పార్టీలోని నేతల గ్రూపులు పటిష్టతకు నిదర్శమనే వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ గ్రూపులే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమయ్యాయని పార్టీ సీనియర్లే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ గ్రామస్థాయిలో నేతల్లోని అభిప్రాయాన్ని అధిష్టానం తెలుసుకోలేదు. కనీసం సమీక్షించలేదు. అంతేకాదు గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేదు.

దీంతో అసెంబ్లీ ఎన్నికలతో తీవ్ర నైరాశ్యానికి గురైన కార్యకర్తలు, ఇప్పటికీ అదే నైరాశ్యంలో ఉన్నారు. పార్టీ వారి అభిప్రాయం తీసుకొని ప్రక్షాళన చేస్తుందని, గ్రూపులకు చెక్ పెడుతుందని భావించినవారికి నిరాశే ఎదురవుతుంది. అయితే, ఈ తరుణంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుండటంతో ఎలా నేతల మధ్య సమన్వయం కుదురుతుందనేది ప్రశ్నగా మారింది. పోటీచేసే అభ్యర్థిపై గ్రూపులుగా ఉన్నవారు గెలుపుకోసం ఎలా కష్టపడుతారనేది ప్రశ్నగా మారింది.

ఇంకా ఏమిటీ పెత్తనం?
ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు ప్రధాన అనుచరులమంటూ గ్రామాల్లో వారే పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో కేడర్ విసిగిపోతున్నారని, కనీసం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే కనీసం కలవనివ్వట్లేదని, సమస్యను సైతం చెప్పుకోకుండా అడ్డుకుంటున్నారనే పలువురు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నేతల్లో మార్పురాలేదని, అలాంటప్పుడు స్థానిక ఎన్నికల్లో ఎలా గెలుస్తారనేది చర్చకు దారితీసింది. స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్లు గెలుచుకోవాలని కేటీఆర్, హరీశ్ రావు క్యాడర్‌కు పిలుపునిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిపై దృష్టిసారించామని, పార్టీపై సారించలేదని, క్యాడర్‌ను విస్మరించామని పేర్కొంటున్నారు.

మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అని అప్పుడు పనిచేసే నేతలకు, కార్యకర్తలకు పదవులు గుర్తించి ఇస్తామని హామీ ఇస్తున్నారు. అయితే ఫస్ట్ గ్రామస్థాయిలో పార్టీనేతలతో ముఖాముఖీ నిర్వహించి సమస్యలను తెలుసుకొని, గ్రూపులకు చెక్ పెడితేనే స్థానిక సంస్థల్లో పార్టీ అధిష్టానం ఆశించిన విధంగా మెజార్టీ సీట్లు వస్తాయని, లేకుంటే పార్టీకి గడ్డుకాలం తప్పదని పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా పార్టీ చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది చూడాలి.

 Also Read: Kalpika controversy: మరోసారి వివాదం సృష్టించిన నటి కల్పిక..

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?