Rajinikanth ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Rajinikanth: ఆ హీరోయిన్ హగ్ ఇవ్వలేదని సెట్ నుంచి వెళ్ళిపోయిన రజినీకాంత్?

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన్ని ముసలోడు అని పిలిస్తే, ఆయన ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోరు. కానీ, సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్, “ముసలోడైనా ఊపు మాత్రం తగ్గలేదు.. హీరోయిన్స్‌ని హగ్ చేసుకునే విషయంలో రజినీ ముందుంటాడు” అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ఇంతకీ ఈ గాసిప్ ఎందుకు వచ్చింది? రజినీ ఏ హీరోయిన్‌ని హగ్ అడిగాడు? అసలు ఈ ట్రోలింగ్ వెనుక ఫుల్ స్టోరీ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Also Read: Samantha: ఆ ఛాలెంజ్‌ లో సమంత గెలిచింది.. ఒక్క దెబ్బతో అలాంటి రూమర్స్ కి చెక్ పెట్టేసిందిగా!

రజినీకాంత్ స్టార్ హీరోయిన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వారిలో సీనియర్ నటి రంభ కూడా ఒకరు. ఆమె రజినీతో ‘అరుణాచలం’ సినిమాలో నటిస్తూనే, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ‘బంధన్’ సినిమా చేసింది. రెండు సినిమాల షూటింగ్‌లతో రంభ బిజీ బిజీగా గడిపింది. అయితే, ‘అరుణాచలం’ షూటింగ్ సెట్‌లో సల్మాన్ ఖాన్ వెళ్లడంతో, రంభ ఆయన్ని చూసి వెళ్లి హగ్ చేసుకొని మాట్లాడిందట. దీన్ని చూసిన రజినీకి కాస్త చిరాకుగా అనిపించిందట.

Also Read: Samantha: ఆ ఛాలెంజ్‌ లో సమంత గెలిచింది.. ఒక్క దెబ్బతో అలాంటి రూమర్స్ కి చెక్ పెట్టేసిందిగా!

“బాలీవుడ్ హీరోలకి హగ్, మనకి షేక్‌హ్యాండ్‌తో సరిపెడుతుందా?” అని మనసులో అనుకొని, చిరాకుతో సెట్ నుంచి వెళ్లిపోయారట. ఆ తర్వాత డైరెక్టర్ రంభ దగ్గరకు వెళ్లి, “మీరు రజినీని హర్ట్ చేశారు, ఇలా చేయకూడదు” అని చెప్పడంతో, రంభకి ఏమీ అర్థం కాక ఏడ్చేసిందట. కాసేపటికి రజినీ తిరిగి వచ్చి, “బాలీవుడ్ హీరోలు వస్తే హగ్‌లిస్తావ్, మేము వస్తే షేక్‌హ్యాండ్‌తో సరిపెట్టేస్తావ్. రేపటి నుంచి అందరూ లైన్‌లో నిల్చొని రంభ హగ్ కోసం వెయిట్ చేయండి” అంటూ సరదాగా ఆటపట్టించారట. ఈ మాటలకు రంభ మళ్లీ హర్ట్ అయి ఏడ్చేసిందట. చివరకు రజినీ, “అరె, నేను జోక్ చేశాను రంభ ” అని సర్దిచెప్పారట.ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, నెటిజన్స్ రజినీని టార్గెట్ చేస్తూ, “ముసలోడైనా హీరోయిన్స్‌ పై మోజు తగ్గలేదు ” అని కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Nysa Devgn: కూతురు స్కూల్ గ్రాడ్యుయేషన్‌.. గర్వంగా ఉందంటున్న కాజోల్, అజయ్ దేవగన్

Just In

01

BC Reservations: బీసీ రిజర్వేషన్లు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు.. కొట్టి పారేసిన ధర్మాసనం

Telangana BJP: కొత్త నేతలతో టీమ్ వర్క్‌కు బీజేపీ ప్లాన్.. సమన్వయం కుదిరేనా..!

TGSRTC: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై ఆర్టీసీ ఏఐ వినియోగం.. ఎందుకో తెలుసా?

Thummala Nageswara Rao: మంత్రి హెచ్చరించినా.. మారని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఉద్యోగుల తీరు!

GHMC: ముగిసిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ భేటీ.. కీలక అంశాలపై చర్చ!