Alagu Varshini: గురుకుల విద్యాసంస్థల్లో మరింత క్వాలిటీ ఫుడ్‌ను అందించేందుకు పకడ్భందీగా చర్యలు చేపడుతున్నామని ఎస్సీ గురుకుల సంస్థ కార్యదర్శి అలగు వర్షిణి పేర్కొన్నారు. ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, పిల్లలకు నాణ్యమైన, పోషకాహార భోజనాలు అందించేందుకు కేంద్రీకృత కొనుగోలు విధానాన్ని (సెంట్రలైజ్‌డ్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ) రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు తక్కువ బిడ్డింగ్ క్వాట్స్‌తో టెండర్లు ఇచ్చి తక్కువ నాణ్యత గల ఆహారం సరఫరా అవుతున్న పరిస్థితికి చెక్ పెట్టామని పేర్కొన్నారు. కొత్త విధానంలో జిల్లా కలెక్టర్ల సమక్షంలో, జిల్లా కొనుగోలు కమిటీల పర్యవేక్షణలో డైట్ ప్రొవిజన్స్, కూరగాయలు వంటి వస్తువులు జిల్లా స్థాయిలో కొనుగోలు చేస్తారన్నారు.
Also Rad: Talasani Srinivas Yadav: పారదర్శకత లేకుండా కులగణన.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు!
మాంసం వంటి వస్తువుల కోసం మండల స్థాయిలో టెండర్లు నిర్వహిస్తారని, అర్హత కలిగిన టెండర్లలో లాటరీ విధానాన్ని అనుసరించి విక్రేతల ఎంపిక జరుగుతుందని తెలిపారు. అన్ని హాస్టళ్లలో ఒకే రకమైన డైట్‌ప్లాన్ అమలులోకి వస్తుందని తెలిపారు. ఇక సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అన్ని సీట్లు ఇప్పటికే భర్తీ అయ్యాయన్నారు. ప్రామాణికమైన పరీక్షల ద్వారా తయారైన మెరిట్ జాబితాల ప్రకారమే ఎంపికలు జరిగాయని, ఎలాంటి మధ్యవర్తుల తలదూరకుండా పూర్తిగా పారదర్శకంగా అడ్మిషన్లు నిర్వహించామని స్పష్టం చేశారు.
విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ
ఇంకా ఖాళీగా ఉన్న ఇంటర్మీడియట్ కోర్సులకు జూలై 31న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు తెలిపారు. జూలై 30 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో ఖాళీ సీట్ల జాబితా ఉంచుతామని చెప్పారు. అంతేగాక పాఠశాలలలో నాణ్యమైన విద్యను మరింత మెరుగుపర్చేందుకు టీచర్లకు శిక్షణ, డిజిటల్ లెర్నింగ్ వనరులు, మార్గినలైజ్డ్ విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలిపారు. విద్యార్ధుల ఆరోగ్యం విషయంలో గురుకులాల సమీపంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం కానున్నట్లు తెలిపారు.
Also Read: Patan Cheruvu constituency: తగ్గనున్న ఎంపీటీసీల స్థానాలు.. ప్రభుత్వం గెజిట్
